కోటి పరిహారం ఇవ్వాలి

భార్యకు డిప్యూటీ తహసిల్దార్ ఉద్యోగం

2
TMedia (Telugu News) :

కోటి పరిహారం ఇవ్వాలి

భార్యకు డిప్యూటీ తహసిల్దార్ ఉద్యోగం

శ్రీనివాసరావుకుటుంబానికి సీఎల్పీ నేత పరామర్శ

టీ మీడియా,డిసెంబర్ 3, ఖమ్మం :విధి నిర్వహణలో దారుణంగా హత్యకు గురైన ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు కుటుంబానికి రూ. 50 లక్షలు కాకుండా కోటి రూపాయలు పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం, జిల్లా రఘునాథపాలెం మండలం, ఈర్లపూడి గ్రామానికి వెళ్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు భార్యా పిల్లలను తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చి, మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ స్థితిగతులను, ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన ప్రగాఢ సంతాపం సానుభూతిని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపారు. అనంతరం స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విధి నిర్వహణలో నిఖార్సయిన నిజాయితీ అధికారి శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోవడం చాలా దారుణమైన సంఘటన అన్నారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని పేర్కొన్నారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని డిమాండ్ చేశారు. కనీసం కోటి రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

 

Also Read : స్పైస్‌జెట్‌ విమానానికి తప్పిన ప్రమాదం

 

ప్రభుత్వం ప్రకటించినట్టుగానే డిప్యూటీ తహసీల్దార్ ర్యాంక్ ఉద్యోగం వెంటనే ఆ కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు సమస్యలను నాన్చకుండా వీలైనంత త్వరగా పరిష్కరించి సంబంధిత రైతులకు పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పూ వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం నగర అధ్యక్షులు మహమ్మద్ జావిద్ పీసీసీ సభ్యులు మళ్లీ ఇది వెంకటేశ్వర్లు గారు రెండో డివిజన్ కార్పొరేటర్ ఖమ్మం లకావత్ సైదులు ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ ఖమ్మం వడ్డే నారాయణ రావు గారు పిసిసి సభ్యులు పుచ్చకాయల వీరభద్రం పిసిసి సభ్యులు రఘునాథపల్లి మండలం భూక్య బాలాజీ .కొంటిముక్కల నాగేశ్వర రావు .కరుణాకర్ రెడ్డి ..బాతుల సుధాకర్ పాపులు ప్రాముఖ్య తండా భోజట్ల సతీష్ ,బాలాజీ నాయక్ ఎంపీటీసీ వెంకన్న కాంగ్రెస్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube