కామ్రేడ్ అలజంగి త్రినాధ రావు 13వ వర్ధంతి సభ

0
TMedia (Telugu News) :

టి మీడియా, నవంబర్ 7, చర్ల :

చర్ల మండల పరిధిలో గల సత్యనారాయణపురం గ్రామంలో కామ్రేడ్ అలజంగి త్రినాధరావు 13వ వర్ధంతి సభ ఆదివారం జరిపారు. ఈ కసభలో జగ్గా వెంకటేశ్వరావు పాల్గొని పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి ఇ కొండ చరణ్ మాట్లాడుతూ కామ్రేడ్ అలజంగి త్రినాధరావు ప్రజల పక్షాన పోరాటం చేసి, సిపిఎం పార్టీ బలోపేతానికి కృషి చేసి, నాయకుడిగా కోడు పోరాటానికి కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు పోరాటాలు ఉధృతం చేయాలని తెలిపారు. శాటిలైటు విధానంతో పోడు భూమి సర్వే విధానం లేకుండా క్షేత్రస్థాయిలో పోడు భూములు సర్వే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అటవిశాఖ ద్వారా కాకుండా గిరిజన ఏజెన్సీ అడవి హక్కుల కమిటీ ద్వారా అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజన రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని వర్థంతి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కారం నరేష్, మచ్చా రామారావు, తాటి నాగమణి, వీరాస్వామి, కుర్సం నాగేశ్వరరావు, లక్ష్మయ్య, కాంతయ్య, గోపి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Comrade Ala jangi Trinadha Rao 13th Vardhanti Sabha.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube