నల్లని నేలలో ఎర్ర సూరీడు

మాదన నారాయణ కు నివాళులు అర్పించిన సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు

1
TMedia (Telugu News) :

నల్లని నేలలో ఎర్ర సూరీడు

మాదన నారాయణ కు నివాళులు అర్పించిన సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు

టీ మీడియా,ఆగస్టు 8, గోదావరిఖని : సిపిఐ,ఏఐటీయూసీ ఆద్వర్యంలో అమరజీవి కామ్రేడ్ మాదన‌‌‌ నారాయణ రెండవ వర్ధంతి సందర్భంగా సోమవారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు నారాయణ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఏ ఐ టి యు సి నాయకుడు కామ్రేడ్ శనిగరపు చంద్ర శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు కే.స్వామి,సీపీఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కే. కనక రాజ్, ఏఐటీయూసీ ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ లు మాదన నారాయణ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సిపిఐ,ఏఐటీయూసీ ప్రజాసంఘాల నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారని వారు అన్నారు.

Also Read : మృతికి రెయిన్బో పాఠశాల యాజమాన్యమే కారణం

పార్టీ సిద్దాంతాన్ని ఖచ్చితంగా ఆచరించిన వ్యక్తి కామ్రేడ్ నారాయణ అని వారు అన్నారు.రాష్ట్ర కంట్రోల్ కమీషన్ ఛైర్మన్ గా ఉమ్మడి కరీం నగర్ జిల్లా కార్యదర్శి గా ఏ ఐ టి యు సి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి గా పార్టీకి,యూనియన్ కు ఎనలేని సేవలు చేశాడని వారు కొనియాడారు. ప్రతి కార్యకర్త నారాయణ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లడానికి కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ,ఏఐటీయూసీ నాయకులు గోసిక మోహన్, తాళ్ళపెల్లి మల్లయ్య,బొడ కుంట కనకయ్య, తోడుపునూరి రమేశ్ కుమార్,మద్దెల దినెష్, రంగు శ్రీనివాస్,మాదన మహేష్ మాటేటి శంకర్, ఎర్రల రాజయ్య,రేనుకుంట్ల ప్రీతం,కే.జగన్,గుంపుల కుమారస్వామి,రొంటాల లింగయ్య,విజయ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube