ఆకలేస్తోంది.. అన్నం పెట్టండి

కాలేజీ గేటు వద్దహాస్టల్‌ విద్యార్థుల ఆవేదన

0
TMedia (Telugu News) :

ఆకలేస్తోంది.. అన్నం పెట్టండి..

– కాలేజీ గేటు వద్దహాస్టల్‌ విద్యార్థుల ఆవేదన

టి మీడియా, ఫిబ్రవరి 17,సింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : ఆకలేస్తోంది.. అన్నం పెట్టండి అంటూ ఎస్‌సి హాస్టల్‌లో ఉంటున్న ఇంటర్‌ విద్యార్థులు కళాశాల గేటు వద్ద బోరున విలపించిన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రభుత్వ సోషల్‌ వెల్ఫేర్‌ కాలేజీ వద్ద గురువారం జరిగింది. సింగరాయకొండ గవర్నమెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌ మూలగుంటపాడులోని ఓ అద్దె నివాసంలో ఉంది. ఈ హాస్టల్‌లో ఇంటర్‌ చదివే తొమ్మిది మంది విద్యార్థినులు ఉన్నారు. అన్నం సరిగా ఉండటం లేదని, సరిపడా పెట్టడం లేదని విద్యార్థునులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతిరోజు ఇలాగే జరగుతుండటంతో విద్యార్థులు రోడెక్కారు. విషయం తెలుసుకున్న కళాశాల అధ్యాపకులు వారి వద్దకు వచ్చి, తినడానికి టిఫెన్‌ ఇచ్చారు. విద్యార్థులకు భోజనం ఎందుకు పెట్టడం లేదని వార్డెన్‌ను నిలదీశారు. ఈ విషయాన్ని తహశీల్దార్‌, ఎంఆర్‌ఒకు చేరవేశారు. వారిద్దరూ హాస్టల్‌ వద్దకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. అధ్యాపకులు ఇచ్చిన టిఫిన్‌ చేసినా.. తాగడానికి మంచి నీళ్లు లేవని విద్యార్థులు అధికారుల దృష్టికి తెచ్చారు.

Also Read : కేసీఆర్ కు వెన్నుదన్నుగా సమాజం

మీ అందరినీ మండల కాంప్లెక్స్‌లో ఉన్న బిసి బాలికల హాస్టల్‌కు తరలించే ప్రయత్నం చేస్తామని, ఉన్నతాధికారులకు నివేదిక పంపించి సిబ్బందిపై చర్యలు తీసుకునే విధంగా చూస్తామని అధికారులు హామీనిచ్చారు.. ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు, కెవిపిఎస్‌ సింగరాయకొండ మండల అధ్యక్షులు పేమల బాబురావు హాస్టల్‌ను పరిశీలించి.. విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్‌ను సస్పెండ్‌ చేయాలని జిల్లా అధికారులకు లేఖ రాశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube