సీఏను సస్పెండ్ చేయాలని గ్రామస్తులు ఆందోళన

సీఏను సస్పెండ్ చేయాలని గ్రామస్తులు ఆందోళన

0
TMedia (Telugu News) :

సీఏను సస్పెండ్ చేయాలని గ్రామస్తులు ఆందోళన

టీ మీడియా, అక్టోబర్ 21, నర్సంపేట (ఖానాపురం): ఖానాపురం మండల కేంద్రంలో ఉధృత నెలకొంది. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన మహిళా సంఘాల సీఏ విజిత గ్రామంలోని పలు మహిళా సంఘాల కు తెలియకుండా వారి పేరు మీద లోన్లు ఎత్తుకొని అవినీతికి పాల్పడింది. ఈ విషయమై గతంలో మహిళా సంఘాల వారు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణకు వచ్చిన ఏపీఎం సుధాకర్ సీఏ కి అనుకూలంగా మాట్లాడుతున్నాడని అధికారులను గదిలో బంధించారు.

Also Read : ఎస్ సి సెల్ మండల అధ్యక్షులుగా శాంతి కుమార్

ఇప్పటివరకు మహిళా సంఘాల సొమ్ము తిరిగి చెల్లించకపోవడంతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అవినీతికి పాల్పడిన సీఏను విధుల్లోంచి తొలగించి అవినీతికి పాల్పడిన సొమ్మును రికవరీ చేయాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పోలీసులు వచ్చినా రోడ్డుపైనే బైఠాయించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube