విద్యార్థినీ అతి కిరాతకంగా చంపిన వ్యక్తిని శిక్షించాలి

విద్యార్థినీ అతి కిరాతకంగా చంపిన వ్యక్తిని శిక్షించాలి

1
TMedia (Telugu News) :

విద్యార్థినీ అతి కిరాతకంగా చంపిన వ్యక్తిని శిక్షించాలి

 

టీ మీడియా, అక్టోబర్ 26, వనపర్తి బ్యూరో :ఎమ్మార్పిఎస్ అధ్వర్యంలో మంగళవారం హత్యకు గురైన విద్యార్థిని గీత మృత దేహాన్ని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీ రూంలో బుధవారం సందర్శించారు.హత్యకు సంబంధించి వివరాలు తెలుసుకున రాజానగరం రాజేష్ మాదిగ ఎమ్మార్పిఎస్ జిల్లా కన్వనర్ మాట్లాడుతూ
నేటి బాలలు రేపటి పౌరులుగా సమాజాన్ని,దేశాన్ని మార్చగల సామర్థ్యంతో విద్యలో రాణిస్తున్న సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణం పునరావృతం కాకుండా తాగు చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకోవాలి.కన్న బిడ్డలను కడతేర్చే కసాయి తండ్రులలో,వ్యక్తులలో ఈ ఘటన ద్వార అయినా మార్పు రావాలి. పిల్లలు 18 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళలో మానసిక ఎదుగుదల ఉండదు కాబట్టి వాళ్ళు చేసేది ఏమైనా ఉంటే వారికి తెలియకుండానే జరిగిపోతుంది.వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడనికి అనేక మార్గాలున్నాయి. ఏదేని సమస్యల పరిష్కారం కోసం షీ టీమ్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వారి దృష్టికి తీసుకు వచ్చి పరిష్కారం పొందవచ్చు.

 

Also Read : నిజాయితీని చాటుకున్న ఆటో డ్రెైవర్

 

తల్లి దండ్రులు,బంధువులు చుట్టూ పక్కల వారు ఎవరికి అయినా ఇబ్బంది ఉంటే ఆ సమస్య ఎక్కువగా చూపించ కుండా మానసిక క్షోభకు గురైనా వారికి సరైన సూచనలు చేస్తూ వారికి మనో ధైర్యం కల్పించాలి. పసి పిల్లలు చేసే తప్పు ఎలాంటిధో కానీ వాటిని ఎత్తి చూపే వారి ద్వారానే పరువు ప్రతిష్ట పోతుంది అని అను నిత్యం ఎక్కడో ఒక దగ్గర నిత్యం పరువు హత్యలు జరుగుతున్నవి.నవ సమాజ నిర్మాణం కోసం యువత స్వచంద సంస్థలు ప్రజా సంఘాల బాధ్యతగా స్వీకరించాలి. గడచిన కొన్ని సంవత్సరాల నుండి జిల్లాలో జరుగుతున్నదాడులు,అత్యాచారాలు,దౌర్జన్యాలు,పరువు హత్యలు నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి .కట్టడి చేయడంలో ఇటు పోలీసు లు, సంబంధిత జిల్లా అధికారులు పాలకుల వైఫల్యం కుడా లేకపోలేదు. దీంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.అని ప్రజాస్వామిక వాదులు అభిప్రాయ పడుతున్నారు. ఈ కార్యక్రమంలో గంధం నాగరాజు, ఎస్సి ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు,కొమ్ము చెన్న కేశవులు మాదిగ, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా సీనియర్ నాయకులు,బాధితురాలి కుటుంబ సభ్యులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube