కొలంబియా జైలులో ఘర్షణ.. 51 మంది ఖైదీలు మృతి

కొలంబియా జైలులో ఘర్షణ.. 51 మంది ఖైదీలు మృతి

1
TMedia (Telugu News) :

కొలంబియా జైలులో ఘర్షణ.. 51 మంది ఖైదీలు మృతి
టి మీడియా,జూన్ 29,తులువా: లాటిన్‌ అమెరికా దేశమైన కొలంబియాలోని ఓ జైలులో ఖైదీల మధ్య తలెత్తిన ఘర్షణ మరణాలకు దారితీసింది. నైరుతి కొలబియాలోని తులువా జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో 51 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. జైలులో మంగళవారం ఖైదీలు మధ్య గొడవ మొదలైంది. దీనిని ఆపడానికి గార్డులు ప్రయత్నించారు. అయితే వారిని అడ్డుకోవడానికి ఖైదీలు.. దుప్పట్లు, ఇతర వస్తువులకు నిప్పంటించారు. దీంతో మంటలు వేగంగా వ్యాపించాయి.

Also Read : 500 రోజులుగా రోడ్డుపైనే..

ఆ పొగతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.ఈ ఘటనలో దాదాపు 30 మంది గాయపడ్డారని, వారిలో జైలు సిబ్బంది కూడా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం జైలులో మంటలు అదుపులోకి వచ్చాయని, ఖైదీలెవరూ తప్పించుకోలేదని చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో అందులో 1,267మంది ఖైదీలు ఉన్నారని వెల్లడించారు. మంటలు చెలరేగిన బ్లాక్‌లో 180 మంది ఉన్నట్లు తెలుస్తున్నది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube