ట్రాఫిక్ నియమాలను పాటిస్తున్నవాహన దారులకు గులాబీ పూలు అందచేత

ట్రాఫిక్ నియమాలను పాటిస్తున్నవాహన దారులకు గులాబీ పూలు అందచేత

0
TMedia (Telugu News) :

ట్రాఫిక్ నియమాలను పాటిస్తున్నవాహన దారులకు గులాబీ పూలు అందచేత
టి మీడియా,ఆగస్ట్ 03 రామగుండం: ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్,ట్రాఫిక్ సిబ్బంది హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు,సీట్ బెల్ట్ పెట్టుకున్న మరియు ట్రాఫిక్ నియమాలను సక్రమంగా పాటిస్తున్న వాహనదారులకు బుధవారం  పుష్పగుచ్చాలు అందచేసి వారిని అభినందించారు.

Also Read : సీఎం జగన్ ను కలిసిన మంత్రి పువ్వాడ

హెల్మెట్,సీట్ బెల్ట్ పెట్టుకోని వారికి ట్రాఫిక్ నియమాలు  ఉల్లంఘించడం వలన కలిగే ప్రమాదాల గురించి, ట్రాఫిక్ మరియు మోటార్ వాహనాల చట్టాలు,రోడ్ సేఫ్టీ, ప్రమాదాల నివారణ గురించి,ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురుంచి వారికి అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరిగినపుడు ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఎంత విషాదకరంగా  ఉంటుందో  వారికి వివరించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సైలు కమలాకర్,రాజేందర్,ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube