నూతన తహసీల్దార్ కు అభినందన
టీ మీడియా,జులై 2, గోదావరిఖని :
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని నూతన తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించిన జాహిద్ పాషా కు ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం శనివారం పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ… పెద్దపెల్లి జిల్లాలోనే రామగుండం పారిశ్రామిక ప్రాంతం చాలా పెద్దదని,ఈ ప్రాంతంలో అధిక కళాశాలలు,పాఠశాలలు ఉన్నందున విద్యార్థులకు కావలసిన కులము,నివాసము,ఆదాయము ధ్రువపత్రాలను ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందుబాటులో ఉండి వారికి కావాల్సిన ధ్రువపత్రాలను అందించాలని తహసిల్దార్ కు తెలియజేయడం జరిగిందని ఆయన అన్నారు.
Also Read : సీపీఎం పార్టీ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభం
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షులు శనిగారపు చంద్రశేఖర్,సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ ఎడవల్లి అనిల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube