కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయం అయింది.

0
TMedia (Telugu News) :

కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయం అయింది.

-ఆరు గ్యారెంటి లకు ఆదరణ పెరిగింది

-కాంగ్రెస్ పటిష్టం అయింది – నగర అధ్యక్షులు మహ్మద్ జావీద్

జావీద్
జావీద్

టి మీడియా, మే 11,,ఖమ్మం:

పార్లమెంట్ ఎన్నికల్లో మతత్వ పార్టీ అయిన బి జె పి, మునిగిపోయి నావయిన బిఆర్ ఎస్ పార్టీలను ఓడించాలని ప్రజల కాంగ్రెస్ నగర పార్టీ అధ్యక్షులు ఎం ,డి జావీద్ పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయం అయింది. ఆరు గ్యారెంటీ లు పై ప్రజల్లో ఆదరణ పెరిగింది.కాంగ్రెస్ గతం కంటే పటిష్టం అయింది. ఈ మేరకు టి మీడియా కి ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు.
ప్ర : పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ప్రచారం చేస్తున్నారు ప్రజల నుండి ఆధారణ ఉన్నది ?

జావీద్ : ఈ ఎన్నికల్లో ప్రజల నుండి చాలా మంచి స్పందన వస్తుంది. రాష్ట్రములో బి ఆర్ ఎస్ పార్టీ పీడ విరగాడై నది అని అన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ మునిగిపోయి నావలాంటిది. ఖమ్మం పట్టణ ప్రజలు చాల సంతోషంగా ఉన్నారు. రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీలో అధికారం రావడం వలన ప్రజలలో మా ప్లాట్ , భూమి దాడికి గురికావు అని ధైర్యంగా వున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గరిటీలను అమలు చేస్తోంది అని అన్నారు. రెండు వందల యూనిట్లు వరుకు ఉచితం, ఐదు వదలకే గ్యాస్ సిలెండర్ ఇస్తుంది. దీనితోపాటు మహిళలకు రాష్టం లో ఎక్కడికి వెళ్లినా ఉచితంగా ప్రయాణం చేస్తున్నదిఅన్నారు. రైతులకు ఆగష్టు పదిహేను తారీకు లోపు రెండు లక్షల మందికి రుణమాఫీ చేస్తాం అని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో రైతులు చాల సంతోషంగా ఉన్నారు.

ప్ర : బూత్ కమిటీ లెవల్ సమన్వయము ఎలా వున్నది ?

జావీద్ : ఖమ్మం పార్లమెంట్ మొత్తం మూడు వందల ఐదు బూతులు వున్నాయి ప్రతి బతుకు ఇద్దరు బూతు కమిటీ సభ్యులు ఉన్నారు. బూతు లెవల్ సమన్వయం చాలాబావుంది..నరేంద్రమోది ప్రతి భారతీయుడి అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తానని, నిరుద్యోగులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి 2014 సంవత్సరంలో వచ్చిన మోడీ ఇచ్చిన హామీలను హమలు చేయకుండా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలను తీసుకవచ్చారు. కార్మికులకు వ్యతిరేకంగా నలభై చట్టాలను తీసుకవచ్చి వారి పని వేళలను ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటలకు పెంచుతున్నాడు. మోడీ మీద బాగా వ్యతిరేకత వున్నది. ఆ పార్టీ కేంద్రములో రెండు వందల సీట్లు దాటవు. కేంద్రములో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ ప్రధాని గాంధీకావడం ఖాయం జ్యోష్యం చెప్పారు.

ప్ర : ఖమ్మం పట్టణం లో మైనార్టీ ఓట్లు కీలకం వారు ఎటువైపు ?

జావీద్ : ఖమ్మం పట్టణము లో ముస్లిం సామాజిక వర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు వున్నది అని అన్నారు. సీపీఐ మరియు సీపీఎం పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామ్యం కావడం వలన వారి సాకారం చాల బహుమానం అని అన్నారు.

ప్ర : ప్రజలకు కాంగ్రెస్ నగర పార్టీ అధ్యక్షుడు గా మీరు ఇచ్చే పిలుపు ఏమిటి ?

జావీద్ : బిజెపి ప్రభుత్వం రాజ్యాంగమును రిజర్వేషన్లను మారుస్తాము అంటుంది. రాజ్యాంగమును కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి . ప్రజలు, మేధావులు అందరూ కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి మా అభ్యర్థి రఘురాం రెడ్డి ని అత్యధిక మెజార్టీ గెలిపిస్తున్న అందరికి ధన్యవాదాలు    for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube