పాలమూరును సర్వనాశనం చేసిందే కాంగ్రెస్
-కరివెన రిజర్వాయర్‌తో 1.50లక్షల ఎకరాలకు నీళ్లు
– సీఎం కేసీఆర్
టీ మీడియా, నవంబర్ 6, దేవరకద్ర : కృష్ణా, తుంగభద్ర నదులు ఒరుసుకుంటూ పారే ఈ పాలమూరు జిల్లాను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. పాలమూరు జిల్లా ఒకప్పుడు పాలుగారిన జిల్లా. అద్భుతమైన జిల్లాను సమైక్య రాష్ట్రంలో ఘోరమైన గతి పట్టించారు. ఆనాడు ఉన్న సీఎంలు కూడా జిల్లాను దత్తత తీసుకున్నామని చెప్పి పునాది రాళ్లు వేశారు తప్ప.. కసికెడు నీళ్లు తెచ్చివ్వలేదు. పంటటలు ఎండిపోయి వలవల ఏడ్సి, బొంబాయి బతకపోయి చాలా వలసలు పోయి, చాలా బాధలు అనుభవించిన జిల్లా పాలమూరు. అలాంటి పాలమూరు జిల్లాను ఏ పార్టీ పట్టించుకున్నది..? మన గోస ఎవడైనా చూసిండా..? అన్నది ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. కృష్ణా, తుంగభద్ర నదులు ఒరుసుకుంటూ పారే జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టించే గతి పట్టించింది
Also Read : పేదలు గొప్పగా జీవించాలన్నదే బీఆర్‌ఎస్ లక్ష్యం
ఏ పార్టీనో ఆలోచించాలి. మహబూబ్‌నగర్ జిల్లా 50 ఏండ్ల పాటు చాలా కరువు అనుభవించింది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రప్రదేశ్‌లో కలిసి మన ప్రాజెక్టులను సమైక్య పాలకులు రద్దు చేశారు. ఒకటే ఒక్క ప్రాజెక్టు అడగలేదు నాటి కాంగ్రెస్ నాయకులు. బచవాత్ ట్రిబ్యునల్ 1974లో నది నీళ్ల పంపకం చేస్తే ఏ మంత్రి, ఎమ్మెల్యే అడగలేదు. పాలమూరుకు నీళ్లు ఎన్ని కేటాయిస్తున్నారని ప్రశ్నించలేదు. ఇది రికార్డులో ఉంది.. రాజకీయం కోసం చెప్పట్లేదు.ఇంత అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్. పాలమూరును సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్సే. మీ పెద్దలను అడిగినా ఇదే విషయం చెబుతారు. నేను చెప్పింది నిజమైతే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని 50 వేల మెజార్టీతో గెలిపించాలి. నిజం కాకపోతే మమ్మల్ని ఓడించండి. 2004లో పొత్తు పెట్టుకుని మళ్లీ మోసం చేసింది. వైఎస్ మాటలు విని మన పార్టీని మోసం చేసింది కాంగ్రెస్. ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని మొండిపట్టుదలతో పోతే, 14 ఏండ్ల పోరాటం తర్వాత చివరకు దీక్ష పడితే దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేశారు. మళ్లీ వెనక్కి వెళ్లారు. వందల మంది పిల్లల ప్రాణాలను బలిగొన్న తర్వాత, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే తప్పనిసరిస్థితుల్లో గతిలేక తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ అని కేసీఆర్ తెలిపారు. కరివెన రిజర్వాయర్ పనులు పూర్తి కావొచ్చాయని.. అందుబాటులోకి వస్తే దేవరకద్ర నియోజకవర్గంలో మొత్తం 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. దేవరకద్రలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవరకద్ర బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
Also Read : కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీ కండ్ల ముందే ఉన్నది. పెండింగ్ ప్రాజెక్టులన్నింటి మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అందరూ కలిసి నెట్టంపాడు, బీమా, కల్వకుర్తి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకొని నీళ్లు తెచ్చుకున్నాం. మీదగ్గర కూడా కోయిల్‌సాగర్ లిఫ్ట్ మొదలుపెట్టినా పెండింగ్‌లో ఉండే. వెంకటేశ్వర్‌రెడ్డి పట్టుపట్టి పనులు పూర్తి చేయించి నీళ్లు వచ్చేలా ప్రయత్నం చేశారు. నిన్నగాక మీ కండ్ల ముందనే పాలమూరులో స్విచ్ఛాన్ ఆన్ చేశాను. పాలమూరు-రంగారెడ్డి పథకం అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి. త్వరలోనే నీళ్లన్నీ రాబోతున్నాయి’ అని తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube