టీ మీడియా బోనకల్
ఏఐసీసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతున్న డిజిటల్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల సభ్యత్వ ఎన్ రోలర్,మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు కర్నాటి రామకోటేశ్వరరావు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాలి దుర్గారావు ఆధ్వర్యంలో సోమవారం బోనకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి బాధ్యులకు సభ్యత్వ నమోదు చేసి గ్రామాల్లో గల పార్టీ కార్యకర్తలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టవలసిందిగా వారికి సూచనలు,సలహాలు అందజేశారు.పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు రెండు లక్షల రూపాయలు ప్రమాదభిమా పార్టీ కల్పిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాలి దుర్గారావు,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు కర్నాటి రామ కోటేశ్వరరారావు,వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్,
గ్రామ శాఖ అధ్యక్షుడు మరీదు శ్రీను,గ్రామ ఉపాధ్యక్షుడు వరకోటి వెంకటేశ్వర్లు,వార్డ్ మెంబర్ కనగాల నాని,అమేపాక వెంకట కృష్ణ, స్వామి,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.