టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు

ఆహ్వానించిన మంత్రి జగదీష్ రెడ్డి

1
TMedia (Telugu News) :

టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు

– ఆహ్వానించిన మంత్రి జగదీష్ రెడ్డి

టీ మీడియా, ఆగస్టు 26, నల్లగొండ : టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన అనుచరులు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..నమ్మిన పార్టీని, నమ్ముకున్న ప్రజలను అమ్ముకోవడం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోను వీరు మోసాలకు పాల్పడ్డారన్నారు.

 

Also Read : రోడ్డు ప్ర‌మాదంలో సీఎం ఓఎస్డీ దుర్మ‌ర‌ణం

కడపకు నీటిని తరలిస్తుంటే వైఎస్‌కు వంత పాడారని గుర్తు చేశారు. రాజీనామా చేస్తే ఉప ఎన్నికలే వస్తాయి. అభివృద్ధి కోసమైతే మీ సహచరులు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల ఓట్లతోటే ఆయనకు రూ. 22,000 కోట్ల కాంట్రాక్టు వచ్చిందన్నారు. బీజేపీకి ఓటేస్తే మోటర్లకు మీటర్లు పెడుతారన్నారు. కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇంచార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జడ్పీటీసీ ఏ.వీ రెడ్డి, ఎంపీపీ శ్వేతా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube