కాంగ్రెస్ నాయకుల నిరసన
టీ మీడియా,మార్చి, 08, జన్నారం:
మండల కేంద్రము లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం రోజున టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం మూతికి నల్ల బట్ట కట్టుకొని కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. సోమవారం రోజున అసెంబ్లీ లో బట్టి విక్రమార్కుని అవమానం ,కించపరచడం,ఒక నియంత్రణ పాలన చేస్తున్నారని మౌన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రభుదాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి, ముత్యం రాజన్న, సీనియర్ నాయకులు కరుణాకర్, పట్టణ అధ్యక్షుడు దూమల్ల రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇందయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షుడు వసీం పటేల్, మండల ప్రచార కార్యదర్శి అజార్, మండల కార్యదర్శి లకావత్ తిరుపతి, యూత్ కాంగ్రెస్ నాయకులు మంద రాజేష్, హేమంత్ చారి, అబ్దుల్ ముజ్జు, దూమల్ల ప్రవీణ్, రోహిదాస్, తాజ్ తదితరులు పాల్గొన్నారు.