ధాన్యం కొనుగోలు కేంద్రంలో పర్యటించిన కాంగ్రెసు నాయకులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్ 28, కరకగూడెం ;

కరకగూడెం మండల కేంద్రంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో పర్యటించి అక్కడ ఉన్న రైతుల సమస్యలను తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు & ఏ బ్లాక్ కోఆర్డినేటర్ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నారు.ఇప్పటి వరకు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఒక్క బస్తా కూడా కోనుగులు చేసినటువంటి దాఖలాలు లేవన్నారు.ఈ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పట్టడానికి సంచులు కూడా రాలేదన్నారు.వాతావరణ పరిస్థితులు బాలేనందున కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసి పోతుందని రైతులు భయాందోళనకు గురై సత్వరమే ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల బీసీ సెల్ అధ్యక్షులు బైరిశెట్టి రామారావు,మండల యువజన అధ్యక్షులు కునుసొత్ సాగర్,కరకగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఊకె రామనాథం,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Congress leaders visit grain purchasing center.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube