కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

1
TMedia (Telugu News) :

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

టీ మీడియా, జూన్ 17, వనపర్తి బ్యూరో : కాంగ్రెస్ పార్టీ అధినేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు నిరసనగా రాజ్ భవన్ ముట్టడికి వెళ్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలను విచక్షణరహితంగా పోలీసుల నుంచి లాటి చార్జి చేసి, కేసులు పెట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పిసిసి పిలుపుమేరకు వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ ఎదురుగా శుక్రవారం నుండి 11:30 వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేసి ధర్నా చేయడం జరిగింది.

Also Read : ఆర్పీఎఫ్ కాల్పుల్లో వ‌రంగ‌ల్ యువ‌కుడి మృతి

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ ప్రసాద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ యూత్ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ, కక్షపూరితంగా జైల్లో పెట్టి గెలవడం అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీకు పుట్టగతులుండవని కావాలని మా నాయకులపై ఈడీ కేసు పెట్టి వేధించడం ప్రజలు హర్షించరు అని, రాబోయే కాలంలో మిమ్మల్ని ప్రజలే శిక్షిస్తరని ఈ సందర్భంగా నాయకులు ప్రసంగించారు.

Also Read : అగ్నిపథ్ పథకం అంటే?

నిరసన కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శంకర్ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ, మాజీ ఎంపిటిసి కోటయ్య, యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నందిమల్ల చంద్రమౌళి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పాండి సాగర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు రమేష్ సీనియర్ నాయకులు అనిస్, మాజీ వైస్ ఎంపీపీ సురేష్ గౌడ్, నాగవరం యాదయ్య, సీనియర్ నాయకులు మంటేపల్లి రాములు, యూత్ కాంగ్రెస్ నాయకులు యాదగిరి, శివ శంకర్ యాదవ్,గణపురం నాయకుడు కృష్ణ యాదవ్, పానుగల్ యూత్ నాయకుడు వహీద్, నాగరాజు, మాజీ ఉపసర్పంచ్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube