కాంగ్రెస్ పార్టీ బతకాలంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలి
కాంగ్రెస్ పార్టీ బతకాలంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలి
కాంగ్రెస్ పార్టీ బతకాలంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలి
టీ మీడియా, అక్టోబర్ 30, వనపర్తి బ్యూరో : కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వనపర్తి సీనియర్ కాంగ్రెస్ నాయకుల విన్నపం.
అమ్మ సోనియమ్మ, రాహుల్ గాంధీ , రేవంత్ రెడ్డి మీకు శతకోటి నమస్కారాలు.
కాంగ్రెస్ పార్టీకి ఇంత ఆదరణ వచ్చిందంటే కర్ణాటకలో మీరు తీసుకున్న గొప్ప నిర్ణయాల వల్ల తెలంగాణలో మీరు చేసిన సర్వేలపై టికెట్లు ఇస్తారని గెలుపొందే వారికి టికెట్లు ఇస్తారని చెప్పిన మాటలకు
అట్టడుగున్న కార్యకర్తలతో )సహా నాయకులందరూ ఏకతాటి పైకి వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు.
అలాంటి పరిస్థితుల్లో వనపర్తి నియోజకవర్గంలో గత మూడేళ్లుగా చిన్నారెడ్డి హటావో కాంగ్రెస్కు బచావో అంటూ నినాదాలతో వనపర్తి లో కాంగ్రెస్ పార్టీ బతకాలని కొత్త వారికి అవకాశం రావాలని ప్రతి కార్యకర్త నాయకుడు కోరుకుంటున్నారు.
Also Read : చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
ఇది చూసి ప్రజలు కూడా చిన్నారెడ్డి ని వద్దంటూ ,
సర్వేలలో అందరికంటే ముందున్న గ్రామ గ్రామాన మంచి పేరు పేరు తెచ్చుకున్న తూడి మేఘ రెడ్డి కి టికెట్ ఇవ్వాలని ప్రజలంతా వేడుకుంటున్నారు.కనుక కాంగ్రెస్ పార్టీ విధేయులు అయిన మీరు తొందరగా నిర్ణయం తీసుకుని చిన్నారెడ్డిని తప్పించి తూడి మేగా రెడ్డి కి ఇవ్వగలరని ప్రజలతోపాటు కార్యకర్తలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చేతులెత్తి మిమ్మల్ని వేడుకుంటున్నారు అన్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ శంకర్ ప్రసాద్, మాజీ పిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసిలు తేనేటి రవీందర్ రెడ్డి, రమేష్ గౌడ్, మాజీ మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి. మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, సీనియర్ నాయకులు మధు గౌడ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.