ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ నిరసనలు

ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ నిరసనలు

1
TMedia (Telugu News) :

ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ నిరసనలు

టీ మీడియా,ఆగస్టు5, అమరావతి : కేంద్రంలోని మోదీ సర్కార్‌ పెంచుతున్న ధరలకు వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ ఏపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. కడప జిల్లా వేంపల్లిలో పీపీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల సామాన్యుడు బ్రతుకలేని పరిస్థితి వచ్చిందని అన్నారు.పెట్రోలు, వంటగ్యాస్‌, నూనెగింజలు, తదితర నిత్యావసర ధరలను అసాధరణ రీతిలో పెరిగిపోయానని అన్నారు.

Also Read : దేశంలో 20 వేలు దాటిన కరోనా కేసులు

ఏపీలో పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయని తెలిపారు. గుంటూరులో కాంగ్రెస్‌ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పీసీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్‌ వలి మాట్లాడుతూ అటు నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఇటు జగన్‌ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేశాయని ఆరోపించారు. ధరలను తగ్గించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్‌ నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube