కిత్తూరు పై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్   

కిత్తూరు పై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్   

0
TMedia (Telugu News) :

కిత్తూరు పై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్                                                                                                                -ప్రతివ్యూహంతో కమలనాథుల దూకుడు                                                                                                -పోటాపోటీ వ్యూహరచన లు                                                                                                                  -లింగాయత్‌ ఓట్లే కీలకం 

 -తుది అంకానికి కర్ణాటక ఎన్నికల పర్వం

 

టీ మీడియా, మే 4,కర్ణాటక :అసెంబ్లీ ఎన్నికల పర్వం క్రమంగా తుది అంకానికి చేరుకుంటుంది. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీ తలపడుతున్నాయి. బిజెపి మీద ప్రతీకారం తీర్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. కమలనాధుల ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నారు. పోటాపోటీ ఉచిత హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులను వారికి పట్టున్న ప్రాంతాల్లోనే ఓడించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోటలపై బిజెపి నేతలు ఫోకస్ పెడితే.. కమలం పార్టీకి మొదట్నుంచి బాగా పట్టున్న నియోజకవర్గాలపై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు. భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి వాయువ్య కర్ణాటక ప్రాంత జిల్లాలపై బాగా పట్టుంది. ఆ ప్రాంతంలో మరాఠీ మాట్లాడే ప్రజలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. వాయువ్య కర్నాటకనే ముంబై కర్నాటక అని కూడా పిలుస్తారు.వాయువ్య కర్ణాటక ప్రాంతంలో మొత్తం ఏడు జిల్లాలు ఉన్నాయి. ఆ ఏడు జిల్లాల్లోని 50 అసెంబ్లీ సీట్లపై బిజెపికి మొదటి నుంచి మంచి పట్టుంది. ఈ ప్రాంతాన్ని ముంబై కర్ణాటక ప్రాంతం అని కూడా పిలుస్తారు. బిజెపికి ఓటు బ్యాంకుగా భావించే లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. యడయూరప్ప బిజెపిలో కీలక నేతగా ఎదిగినప్పటి నుంచి వాయువ్య కర్ణాటక ప్రాంతంలో.. మరీ ముఖ్యంగా లింగాయత్ సామాజికవర్గంలో బిజెపి బలం బాగా పెరిగింది. మధ్యలో యడియూరప్ప పార్టీని వీడిన సందర్భం తప్ప గత మూడు దశాబ్దాలుగా మరాఠా కన్నడ ప్రాంతంలో బిజెపికి బలమైన లీడర్స్.. నమ్మకమైన క్యాడర్ ఉన్నారక్కడ. అయితే ఈ ప్రాంతంలో బిజెపి ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని కాంగ్రెస్ నేతలు తాజా ఎన్నికల్లో గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు.

 also read :కార్మిక(ఖమ్మం )కలెక్టర్

 

ఈ ప్రాంతంలో జనతాదళ్ సెక్యులర్ పార్టీ ఉనికి నామ మాత్రమే.త్రిబుల్ ఆర్ సినిమాలో క్లైమాక్స్ తర్వాత వచ్చే ఎత్తర జెండా పాటలో ప్రస్తావనకు వచ్చిన స్వాతంత్ర సమరయోధురాలు రాణి కిత్తూరు చెన్నమ్మ ఉద్యమాన్ని నడిపిన ప్రాంతం కావడంతో వాయువ్య కర్ణాటక (ముంబై కర్ణాటక) ప్రాంతానికి కిత్తూరు కర్ణాటకగా 2021లో నామకరణం చేశారు. ఈ ప్రాంతంలోని ఏడు జిల్లాలలో బెళగావి జిల్లా అత్యంత కీలకం. రాష్ట్ర రాజధాని బెంగుళూరు తర్వాత బెళగావికి అంత ప్రాధాన్యత ఉంది. బెంగుళూరు కాస్మోపాలిటన్ సిటీ ఏరియాలో మొత్తం 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా బెళగావిలో 18 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. రాజకీయపరంగా బెళగావి అత్యంత కీలకం. 2018 ఎన్నికల్లో బిజెపి 10 సీట్లను, కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లను ఇక్కడ గెలుచుకున్నాయి. బెళగావి ప్రాంతంలో రెండు ప్రధాన పార్టీల్లోనూ రాజకీయ కుటుంబాలదే ఆధిపత్యం. చాలామంది ప్రజాప్రతినిధులు చక్కర సహకార సంఘాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ యధాశక్తి ప్రయత్నిస్తుంది. ప్రజా ధ్వని యాత్ర పేరిట బస్సు యాత్రను కూడా ఇటీవల చేపట్టింది. ఉమేష్ కత్తి, సవదత్తి మామని వంటి కీలక నేతలు హఠాన్మరణం చెందడంతో బిజెపి కొద్దిగా బలహీనపడినట్లు కనిపిస్తుంది.

also read :బిజెపి ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యత

 

ఇద్దరూ ఆ విషయంలో వీక్‌గా ఉన్నారా..? ఈ ఐదు పదార్థాలతో సామర్థ్యాన్ని మరింత పెంచుకోవచ్చు..దానికి తోడు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్, మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ సవది వంటి సీనియర్ నేతలు పార్టీని వీడడం బిజెపికి కొంత నిరాశపరిచే అంశం. జగదీష్ షెట్టర్ హుబ్లీ సెంటర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగి బిజెపికి సవాల్ విసురుతున్నారు. ఇక బిజెపి ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సారథ్యం వహిస్తున్న శిగ్గావ్ సీటు కిత్తూరు కర్ణాటక కిందకే వస్తుంది. 2018 నుంచి ఇక్కడ కాంగ్రెస్ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి దగ్గరలో ఉన్న బాదామి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బరిలో ఉన్నారు. ఇక విజయపుర జిల్లాలో బిజెపి సీనియర్ నేత బసవన గౌడ పాటిల్ నోటికొచ్చినట్లు మాట్లాడటం బిజెపికి తలనొప్పిగా మారింది. గతంలోను ఈయన యడియూరప్పపై బహిరంగంగా విమర్శలు చేయడంతో లింగాయత్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో బిజెపికి నష్టం చేకూరింది. ఈసారి కూడా బసవన గౌడ పాటిల్ నోటి దురుసు పార్టీకి ఇబ్బందిగానే ఉంది.

 

alaso read :పీఠాలు,మఠాలు నిర్వహణ లోని – కల్యాణ మండపాలు కిరాయి రెట్లు ప్రదర్శించాలి,ప్రకటించాలి

తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని పలుమార్లు వ్యాఖ్యానించడం ద్వారా ఆయన పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టుతున్నారు. ఈ అంశాలన్నీ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే సంకేతాలను సూచిస్తున్నాయి. ఇక ఏడు అసెంబ్లీ సీట్లున్న ధార్వాడ జిల్లా కూడా భారతీయ జనతా పార్టీకి కీలకమే. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో అక్కడ బిజెపిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయన భుజస్కంధాల మీద ఉంది.నిజానికి ముంబై కర్ణాటక 1990 కి పూర్వం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లింగాయత్ వర్గానికి చెందిన నాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత వీరేంద్ర పాటిల్ పెరాలసిస్కు గురికావడంతో ఆనాటి ఏఐసిసి అధ్యక్షుడు రాజీవ్ గాంధీ ఆయన్ని పదవి నుంచి తొలగించారు దాంతో ఆ ప్రాంతంలో ఉన్న లింగాయతులు భగ్గుమన్నారు.

also read ;వేదాలు విజ్ఞాన భాండాగారాలు

 

కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం చెందారు. వారంతా బిజెపి లింగాయత్ నేత యడియూరప్ప వెంట నడిచారు. బిజెపికి మూడు దశాబ్దాలుగా అండగా నిలిచారు. 2013 దాకా ఈ ప్రాంతంలో బిజెపి హవా కొనసాగింది. అయితే యడియూరప్ప బీజేపీని వీడి వేరు కుంపటి పెట్టుకోవడంతో లింగాయత్ సామాజిక వర్గం కూడా ఆయన వెంట వెళ్ళింది. దాంతో బిజెపికి పెద్ద దెబ్బే తగిలింది. కాంగ్రెస్ పార్టీకి లాభించింది. ఈ ప్రాంతంలో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 30 సీట్లు గెలుచుకుంది. 2014 లోక్సభ ఎన్నికల అనంతరం యడియూరప్ప మళ్ళీ బిజెపి గూటికి చేరడంతో కిత్తూరు కర్ణాటక ప్రాంతంలో మళ్లీ బిజెపి పట్టు పెరిగింది. దాంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఈ ప్రాంతంలో ఏకంగా 30 సీట్లు గెలుచుకుంది.కాంగ్రెస్ కేవలం 17 సీట్లు దక్కించుకుంది. అయితే తాజా ఎన్నికల్లో యడియూరప్ప పాత్ర ఏమిటి అన్నది క్లారిటీ లేకపోవడంతో లింగాయత్‌లు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిగా మారింది. యడియూరప్పను సంతృప్తి పరచడానికి ఆయన తనయుడిని బిజెపి నేతలు ప్రోత్సహిస్తూ లింగాయత్‌లను మచ్చిక చేసుకునేందుకు వ్యూహ రచన చేశారు. ఇది ఎంతవరకు వారికి అనుకూల ఫలితం ఇస్తుందో క్లారిటీ లేదు. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి సరిగ్గా నెల రోజుల ముందు లింగాయత్‌ల ఓటు బ్యాంకును కాపాడుకునే వ్యూహంతో వారి రిజర్వేషన్లను రెండు శాతం నుంచి నాలుగు శాతానికి కర్ణాటక బిజెపి ప్రభుత్వం పెంచింది. ఇది ఇప్పుడు కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. ఇక ప్రచార పర్వంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా బెళగావి, ధారవాడ ప్రాంతాల్లో మెగా రోడ్ షోలు నిర్వహించారు. భారీ సభలతో హోరెత్తించారు. కాంగ్రెస్ పార్టీ కూడా బిజెపికి ధీటుగా రాహుల్ గాంధీని రంగంలోకి దింపింది. ఈ ప్రాంతంలో యువ క్రాంతి, యువ సమ్మిట్స్ పేరిట కార్యక్రమాలను నిర్వహించింది. రాష్ట్రంలో 224 అసెంబ్లీ సీట్లు ఉండగా కిత్తూరు కర్ణాటక ప్రాంతంలోనే 50 సీట్లు ఉన్నాయి. దాంతో ఈ ప్రాంతంలో మెజారిటీ స్థానాలను దక్కించుకోవడం ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే బిజెపి, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీ వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. ఎవరికి అనుకూలమైన ఫలితాలు వస్తాయో మే 13న వెల్లడి కానుంది‌.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube