ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్‌ ధర్నా

కార్యకర్తలతో కలిసి రోడ్డుపై ప్రియాంక

1
TMedia (Telugu News) :

ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్‌ ధర్నా
-కార్యకర్తలతో కలిసి రోడ్డుపై ప్రియాంక

టీ మీడియా, ఆగస్టు 5,ఢిల్లీ : ధరల పెరుగుదలను నిరసిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఢిల్లీలోని కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు ప్రదర్శన చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. దీన్ని అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులు అక్బర్‌ రోడ్డుకు తరలివచ్చారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ శ్రేణులను అడ్డుకున్నారు. రాహుల్‌ గాంధీ సహ కాంగ్రెస్‌ నేతలంతా నల్ల దుస్తులు ధరించి ఈ ధర్నాలో పాల్గొన్నారు.

 

Also Read : డాక్టర్ వైయస్ఆర్ పొలంబడి కార్యక్రమం

 

ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై తాము నిరసన తెలుపుతున్నామని, కాని పోలీసులు తమకు ఇక్కడి నుంచి కదలనీయడం లేదని రాహుల్‌ గాంధీ తెలిపారు. రాహుల్‌ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పోలీసులు వ్యానులోకి ఎక్కించారు.కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి ధర్నాకు హాజరైన ప్రియాంకా గాంధీ పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. చాలా మంది కార్యకర్తలను పోలీసులు బలవతంగా లాక్కొనిపోయారు. రోడ్డుపై బైఠాయించిన ప్రియాంకా గాంధీని పోలీసులు బలవంతంగా లాకెళ్లారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube