దళితులలో చైతన్యం రావాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 4 వనపర్తి : చలో ఢిల్లీ మాదిగ విద్యార్థులు జాతీయ మహాసభ కు పిలుపునివ్వడం జరిగింది. ఎంఎస్ఎఫ్ జిల్లా సీనియర్ నాయకులు చెన్నకేశవులు మాదిగ శనివారం రోజు కొత్తకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జి వినోద్ అధ్యక్షతన కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా రాజనగరం రాజేష్ మాదిగ ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మంద కృష్ణ మాదిగ మన దళిత కులానికి దిక్సూచిలా నిలిచారన్నారు. వర్గీకరణ మాత్రమే ఎస్సీ సామాజిక వర్గాలకు సమన్వయం అందించగలదు.

ఈ విషయం వర్గీకరణ జరిగిన నాలుగు సంవత్సరాలు నిరూపించాయి. ఇది ఉపకులాల వారే చెబుతున్నారు. మన శాంతియుతమైన ప్రజాస్వామ్య బద్ధమైన పోరాటం ఇక ప్రభుత్వంపైనే ఆ దిశగా మన జాతి మునుపటి కన్నా ఎక్కువగా చైతన్యం కావాలి మాదిగల ఉపకులాలు విద్యావంతులు ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కొక్కరు ఐదుగురు విద్యార్థులను లక్ష్యం వైపు నడిపిస్తే చాలు అందుకే మన బిడ్డలను మనం ఏబిసిడి లు అంటే అవి కేవలం ఆంగ్ల అక్షరాలు కాదు 58 కులాల జీవితాలు అన్ని గుర్తు చేయాలి.ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఇంచార్జ్ ఎంఎస్ఎఫ్ వినోద్ మాదిగ, ఎంఎస్ఎఫ్ నాయకులు వెంకట్, శివ, కేశవ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube