నన్ను అంతమొందించేందుకు కుట్ర
– ఎసిబి కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ
టీ మీడియా, అక్టోబర్ 27, విజయవాడ : ” నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు ” అని టిడిపి అధినేత చంద్రబాబు ఎసిబి కోర్టు జడ్జికి లేఖ పంపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఎసిబి కోర్టుకు లేఖను పంపారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన 3 పేజీల లేఖ రాశారు. ఈ నెల 25న రాసిన ఈ లేఖను చంద్రబాబు జైలు అధికారుల ద్వారా జడ్జికి పంపారు. ” నేను జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫొటోలు తీశారు. నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు. కుట్రపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చింది. ఆ లేఖపై ఇప్పటి వరకు పోలీసు అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదు. జైలులో అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు దుర్మార్గులు జైలులోకి గంజాయి ప్యాకెట్లు విసిరారు.
Also Read : రేషన్ స్కామ్‌లో బెంగాల్ మంత్రి అరెస్ట్
తోటలో ఉన్న కొంతమంది ఖైదీలు గంజాయిని పట్టుకున్నారు. ఖైదీల్లో 750 మంది తీవ్ర నేరాలకు పాల్పడినవారు ఉన్నారు. కొంతమంది ఖైదీల వల్ల నా భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఈనెల 6న జైలు ప్రధాన ద్వారం మీదుగా డ్రోన్ ఎగురవేశారు. ములాఖత్‌లో నన్ను కలిశాక వారి చిత్రాల కోసం డ్రోన్ ఎగురవేశారు. నాతోపాటు నా కుటుంబసభ్యులకు కూడా ప్రమాదం పొంచి ఉంది ” అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube