గోవర్ధన్‌కు మంత్రి కేటీఆర్ పరామర్శ

గోవర్ధన్‌కు మంత్రి కేటీఆర్ పరామర్శ

1
TMedia (Telugu News) :

గోవర్ధన్‌కు మంత్రి కేటీఆర్ పరామర్శ

టి మీడియా, నవంబరు 7, కామారెడ్డి‌ : ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. గంప గోవర్ధన్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ నెల ౩న (గురువారం) గంప గోవర్ధన్ మాతృమూర్తి రాజమ్మ అనారోగ్యంతో మరణించారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కామారెడ్డి జిల్లా, బిక్కనూరు మండలంలోని గంప స్వగ్రామం బస్వాపూర్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

Also Read : వందే భార‌త్ ట్రైన్ ట్ర‌య‌ల్ ర‌న్ షురూ

ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌ గంప గోవర్ధన్‌ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వెంట మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube