31న కానిస్టేబుల్ మోడల్ పరీక్ష
టీ మీడియా,జులై 22, గోదావరిఖని:
భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) రామగుండం కార్పొరేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే మోడల్ కానిస్టేబుల్ పరీక్షను అభ్యర్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని రామగుండం కార్పొరేషన్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపారు.22న కానిస్టేబుల్ మోడల్ పరీక్ష గోడపత్రికను,వన్ టౌన్ సిఐ రమేష్ బాబు చేతుల మీదగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 1టౌన్ సీఐ రమేష్ బాబు మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా జూలై 31న డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే కానిస్టేబుల్ మోడల్ పరీక్షలను అభ్యర్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తద్వారా మరింతగా పరీక్షలకు సంసిద్ధం అవ్వడానికి ఈ మోడల్ టెస్టు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు ఈ సందర్భంగా తెలిపారు.
Also Read : వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల
రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పోటీ పరీక్షలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇచ్చిన వాటికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల యొక్క సామర్ధ్యం మరింతగా మెరుగుపరుచుకునేందుకు ముందస్తుగా వారికి ఆ పరీక్షల పైన అవగాహన రాడానికి వారిలోని భయాన్ని పోగొట్టి పరీక్ష సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అవగాహన రావడానికి ఎన్నో పోటీ పరీక్షలను నిర్వహించిందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.జులై 31న నిర్వహించే మోడల్ కానిస్టేబుల్ పరీక్ష కూడా శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తద్వారా మరింత ఎక్కువగా వారు పరీక్షకు సంసిద్ధం అయ్యేవిధంగా ఎంతో తోడ్పడుతుందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ మోడల్ కానిస్టేబుల్ పరీక్ష రాయాలనుకుంటున్న ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెంబర్లను సంప్రదించాలని 6300067406, 9177660154, జిల్లా అధ్యక్షుడు సాగర్, కార్పొరేషన్ కార్యదర్శి సతీష్ ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ సహాయ కార్యదర్శి రాజ్ కుమార్ కమిటీ సభ్యులు సలీం, కృష్ణ ప్రసాద్,సురేష్,రాకేష్ పాల్గొన్నారు.