కానిస్టేబుల్ కి శ్రీమంతం.
టీ మీడియా, మార్చి 8,చింతూరు :
చింతూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని చింతూరు సర్కిల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవాన్ని చింతూరు ఆడిషినల్ ఎస్పీ జి కృష్ణ కాంత్, ఐపీఎస్ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ గర్భిణీ అయిన విజయలక్ష్మికి ఘనంగా శ్రీమంతం చేశారు. చింతూరు ఆడిషినల్ ఎస్పీ కృష్ణ కాంత్ – గౌతమి దంపతుల కు నూతన వస్త్రాలు, పూలు, పండ్లు, గాజులు బహుకరించి దీ
Also Read: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
మన్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఇలాంటి సంప్రదాయంగా శ్రీమంత కార్యక్రమం అది కూడా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించడం మొదటిసారి కావడం విశేషం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆడిషినల్ ఎస్పీ మాట్లాడుతూ మన్యంలో మహిళలు అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో ముందుకు నడస్తూ ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో చింతూరు సీఐ యువ కుమార్, ఎటపాక సీఐ గజేంద్ర కుమార్, చింతూరు ఎస్సై యాదగిరి, ఎటపాక ఎస్సై పార్థ సారధి, మహిళా పోలీసులు, పోలీసు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube