అంధకారంలో నియోజకవర్గ కేంద్రం

అప్రకటితో విద్యుత్ కోతలతో అల్లాడుతున్న జనం

0
TMedia (Telugu News) :

అంధకారంలో నియోజకవర్గ కేంద్రం

– అప్రకటితో విద్యుత్ కోతలతో అల్లాడుతున్న జనం

– సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దు

– నూతన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం

టీ మీడియా, డిసెంబర్ 6, అశ్వారావుపేట : సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడించిన నాటినుండి నూతన ప్రభుత్వం ఏర్పడక ముందే జరుగుతున్న పరిణామాలు ఆ ప్రభుత్వానికి అప్రతిష్టపాలు తెచ్చే విధంగా ఉన్నాయి. ఏమైందో ఏమో గాని ఎన్నికల ఫలితాలు అనంతరం నియోజవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో విద్యుత్ సరఫరా కు పగలు,రాత్రి తేడా లేకుండా గంట గంటకు అంతరాయం కలుగుతుంది.

రాత్రి వేళ సమయం లో అయితే ఈ అప్రకటిత విద్యుత్ కోతలతో పేట ప్రజలను ఈ మూడు రోజులు అంధకారంలోకి నెట్టేశారు. రాత్రివేళ సమయంలో నిరంతరాయంగా కరెంట్ లేకపోవడంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. మిచ్చాంగ్ తుఫాన్ దృశ్య విద్యుత్ సరఫరా కు అంతరాయం కలుగుతుందని భావిస్తే ఇటువంటి తుఫాన్లు గతం లో ఎన్నో వచ్చాయని పెద్ద పెద్ద గాలివానలు వచ్చిన సందర్భంలో రోడ్లపైన భారీ వృక్షాలు విరిగిపడిపోయినప్పుడు, కరెంట్ స్తంభాలు విరిగిపోయినప్పుడు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా గంటల వ్యవధిలో విద్యుత్ ను పునరుద్దించిన సందర్భాలు కో కొల్లలు ఉన్నాయి.కానీ ఇప్పుడు నూతన ప్రభుత్వం కొలువు తీరక ముందే ఎందుకని ఈ విధంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందో అర్థం కాని పరిస్థితిలో అధికార పార్టీ నాయకులు ఉన్నారు.

Also Read : దళిత బంధు ఆందోళనకారుల లిస్టు పెద్దదే

ఇది నిజంగా విద్యుత్ ను పునరుద్దరణ చేయలేని సమస్యతో అధికారులు కొట్టుమిట్టాడుతున్నారా వాటి ప్రధాన సమస్య ఏంటో తెలియాల్సి ఉంది.ఏది ఏమైనా గతంలో విద్యుత్ సరఫరా లో ఎంతటి పెద్ద సమస్య అయినా గంటల వ్యవధిలో పునరుద్దించే అధికారులు ఈ మూడు రోజులు ఎందుకని సమస్యను పరిష్కరించటం లేదని వారి వైఖరి పలు అనుమానాలకు తావిస్తుందని పేట వాసులు బాహాటంగానే అంటున్నారు. అయితే సిబ్బంది కొరతతో పనులు కొంత ఆలస్యం అయ్యేయే తప్ప తమ సిబ్బంది అహర్నిశలు ఈ మూడు రోజుల నుండి కృషి చేస్తున్నారని తీవ్ర వర్షాభావంతో ఇబ్బంది కలిగిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా కొత్త ప్రభుత్వం కొలువుదీరే ప్రక్రియలో భాగంగా నూతనంగా ఎన్నికైన శాసన సభ్యులు జారే ఆదినారాయణ హైదరాబాదులో ఉన్నారన్న సంగతి ప్రజలకు తెలుసునని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆయన పూర్తిస్థాయిలో పరిపాలన బాధ్యతలు స్వీకరించిన పిదప ఇటువంటి సమస్యలు మరొకసారి పునరావృతం కాకుండా చూస్తారని అప్పటివరకు పేట ప్రజలు సమన్వయం పాటించాలని జారే అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube