నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం ను విజయవంతం చేయాలి.

0
TMedia (Telugu News) :

టీ మీడియా అక్టోబర్ 24,కరకగూడెం:

కరకగూడెం మండలంలో బట్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ కమిటీ టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పోగు ఎల్లా గౌడ్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంత రావు ఆదేశాల మేరకు ఈనెల 27 జరిగే పినపాక నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం మరియు వచ్చే నెల నవంబర్ 15న తేదీన వరంగల్ జరిగే తెలంగాణ విజయ గర్జన సభను విజయవంతం చేయాలని గ్రామ కమిటీ అధ్యక్షులు,పార్టీ కార్యకర్తలకు,నాయకులకు పిలునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ కొంపెల్లి పెద్ద రామలింగం,పార్టీ నాయకులు వాసిరెడ్డి నేతాజీ,లక్క శ్రీనివాస్,మధు,సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమల్ల ప్రవీణ్ కుమార్,ముద్దం సతీష్,కార్యకర్తలు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Constituency level preparatory meeting must be successful.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube