ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
టీ మీడియా, నవంబర్ 26, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష శనివారం ఐడిఓసి కార్యాలయం ప్రాంగణంలో భారత రాజ్యాంగ దినోత్సవం ను పురస్కరించుకొని శనివారం జిల్లా అధికారులు, సిబ్బందితో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1949, నవంబర్ 26వ. తేదిన భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని ఆమె సూచించారు.
తాను రచించిన రాజ్యాంగంలోని హక్కులు, విధులు, బాధ్యతలు తూ.చా. తప్పకుండా పాటించడం ద్వారా మన భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా రూపొందిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. భారత రాజ్యాంగాన్ని 1950, జనవరి 26వ. తేదిన ప్రభుత్వం ఆమోదించడం జరిగిందని, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకోవటం జరుగుతున్నదని ఆమె తెలిపారు.
Also Read : ఓటర్ల నమోదు కార్యక్రమం
ఈ సందర్భంగా భారతదేశ ప్రజలమైన మేము దేశంలో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం నెలకొల్పు కునేందుకు, పౌరులందరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛ, సమానత్వం, జాతి ఐక్యతకు, వ్యక్తి గౌరవానికి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు మనకు మనంగా రూపొందించుకొన్న భారత రాజ్యాంగాన్ని పాటించేందుకు కట్టుబడి ఉంటామని, సత్యనిష్ట పూర్వకంగా ప్రమాణం చేస్తున్నట్లు జిల్లా అధికారులు, సిబ్బందిచే జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గొప్పతనాన్ని, సేవలను, హక్కులను, విధులను, బాధ్యతలను తూ.చా. తప్పకుండా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని, పాటించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ డి వేణుగోపాల్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.