కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం..

శిథిలాల్లో చిక్కుకున్న కార్మికులు

1
TMedia (Telugu News) :

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. శిథిలాల్లో చిక్కుకున్న కార్మికులు
టి మీడియా,ఎప్రిల్ 25,న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని సత్యనికేతన్‌ ప్రాంతంలో సోమవారం నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. భవనంలో పలువురు చిక్కుకున్నట్లుగా తెలుస్తున్నది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Also Read : కొడుకును హతమార్చిన తండ్రి

సత్య నికేతన్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలినట్లుగా సమాచారం అందిందని, ఆ తర్వాత ఫైర్‌ టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. భవనం శిథిలాల కింద ఐదుగురు కార్మికులు చిక్కుకున్నారని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొంది. అయితే, భవనం కూలగడానికి గల కారణాలు తెలియరాలేదు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube