సమీకృత జిల్లా కార్యాలయాలు పనులు తనిఖీ చేసిన కలెక్టర్

సమీకృత జిల్లా కార్యాలయాలు పనులు తనిఖీ చేసిన కలెక్టర్

1
TMedia (Telugu News) :

సమీకృత జిల్లా కార్యాలయాలు పనులు తనిఖీ చేసిన కలెక్టర్

టి మీడియా,నవంబర్ 3,ఖమ్మం : సమీకృత జిల్లా కార్యాలయాల భవన నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ గురువారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనుల్లో వేగం పెంచి, భవనాన్ని అందుబాటులోకి తేవాలన్నారు. అన్ని గదుల ఫ్లోరింగ్ పనులు పూర్తి అయినట్లు, విద్యుత్ పనులు చివరి దశలో ఉన్నట్లు ఆయన అన్నారు. తలుపులు, కిటికీల ఏర్పాట్లలో వేగం పెంచాలన్నారు.

భవనం వెలుపల లెవలింగ్ పనులు జరుగుతున్నట్లు, ఆర్చ్ కు పెయింటింగ్, ఫినిషింగ్ పనులు కావాల్సి ఉందన్నారు. నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు. సబ్ స్టేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేసి, విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సంప్, సెప్టిక్ ట్యాoక్ పనులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. లిఫ్ట్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఆమోదిత కార్యాచరణ మేరకు ప్లాంటేషన్, గ్రీనరీ పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ భవనం వెలుపల, లోపల తిరిగి విద్యుత్‌ పనులు, ఏసీ, డ్రైనేజీ, నీటి సరఫరా, పార్కింగ్‌, టైల్స్‌ పనులను కలెక్టర్ పరిశీలించారు.

Also Read : పాత పెంక్షన్ విధానం కొనసాగించాలి

కలెక్టర్ తనిఖీల సందర్భంగా మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా అటవీ అధికారి, సిద్దార్థ్ విక్రమ్ సింగ్, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణా లాల్, మిషన్ భగీరథ ఇఇ పుష్పలత, వాణిశ్రీ, ఆర్ అండ్ బి ఏ ఇ ఇ విశ్వనాథ్, అధికారులు తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube