దళారీ ద్వారానే దర్శనం..

కలక్షన్ ఏజెంట్లకు కన్సల్టెన్సీ ముసుగు

0
TMedia (Telugu News) :

దళారీ ద్వారానే దర్శనం..

– కలక్షన్ ఏజెంట్లకు కన్సల్టెన్సీ ముసుగు

– పెన్సిల్ ద్వారా ఇండికేషన్

– రికార్డ్ ల మధ్యలో నోట్ల కట్టలు

– సిసి కెమెరాల లో నీక్షిప్తం
– పాలకులు మారినా.. మారని రిజిస్టర్ కార్యాలయం తీరు

టీ మీడియా, డిసెంబర్ 14, ఖమ్మం బ్యూరో : అక్కడ అధికారిని కాదు, ద్వీతీయ శ్రేణి అధికారిని అయినా కలవాలని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసిన పెద్దగా ఫలితం ఉండదు. మీ కళ్ల ముందే ఎటువంటి అనుమతి లేకుండా ఎంతో మంది అనధికారిక వ్యక్తులు వస్తారు వెళుతుంటారు. మీకు మాత్రం పిలుపు రాదు. కాళ్ళు నొప్పి కూర్చుందాం అనుకున్నారో అది ఫలితం ఇవ్వదు. అధికారి గది కి 500ల గజల్లో మలాన 10నుండి 15 వరకు సిట్టింగ్ ఉంటుంది. అవి కూడా నిండుగా ఉంటాయి. మీరు అధికారి కి చెందిన దళారీ ద్వారా వెళితే మాత్రం ఎటువంటి అపాయింట్ మెంటు అవసరం లేదు. నేరుగా కలవచ్చు.. అందుకు కన్సల్టేన్సీ ముసుగు లో ఉన్న దళారీకి మసీదు ను చెల్లించాలి. మీరు చెల్లించిన మసీదు లో కొంతమొత్తం.. రికార్డ్ రూము ఫైల్స్ లోకి చేరుతుంది. ఖమ్మం నగరం లోని శ్రీరాం హిల్స్ వద్ద ఉన్న ఖమ్మం సబ్ రిజిస్టార్ కార్యాలయాల పై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణ లు పై టి మీడియా బృందం క్షేత్ర స్థాయి పరిశీలన జరిపింది. వివరణ కోసం ప్రయత్నం చేయగా 30నిముషాలు వేచి ఉన్న టి మీడియా ప్రతీనిధి కి అపాయింట్మెంట్ దొరకలేదు. మిమ్మల్ని కూర్చోమన్నారు. పిలుస్తా అన్నారని చెప్పారు అక్కడి క్రింది స్థాయు ఉద్యోగిని. కూర్చోవడానికి ఖాళీ లేక నిలబడలేక ప్రతినిధి వెనక్కి వచ్చారు. పాలకులు మారిన రిజిష్టార్ కార్యాలయం లో అవినీతికర పరిస్థితిలు మారలేదు. సిసి కేమేరాలు ఈ అవినీతికరమైన పనులకు మూగ సాక్షి గా ఉన్నాయి. వివరాలలోకి వెళితే..

Also Read : హైదరాబాద్ లో రూ.కోటి విలువైన గంజాయి పట్టివేత

నగరం లోని ప్రవైట్ భవనం లో కార్యాలయం ఉన్న ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్టర్ 1 తో పాటు, ఖమ్మం రూరల్ రిజిస్టార్ పరిధి లో అత్యధికంగా రియల్ వ్యాపారం ఉంది. అత్యధిక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూమి కి, నగరం పరిధి తో పాటు, ఖమ్మం రూరల్, చింతకాని తదితర మండలం లో అక్రమ రిజిస్టేషన్ లు ఆరోపణలు ఉన్నాయి. అవి అన్ని వారికి చెందిన దళరులు ద్వారా కమిషన్ లు తీసుకొని చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ కాలం లో అప్పటి అధికార పార్టీ నాయకులు సూచనలు మేరకు అక్రమాలకు పాల్పడి నగరంలోని రిజిస్టర్ కార్యాలయం సమిపంలోని ధంసలాపురం చెరువు లో కొంత భూమి ప్లాట్లు చేస్తే దానికి రిజిస్టేషన్ చేసి ప్రవైట్ భూమి చేసారు. సాగర్ కాలువ, ప్రభుత్వ డొంక లాంటివి మాయం చేసిన అక్రమార్కుల కు మసీదు తీసుకొని అక్రమ రిజిస్టేష న్ చేసినవారు. తిరిగి అదే వరవడిని ప్రభుత్వం మారినా కోనసాగిస్తున్నట్లు తెలిసింది. నగరం లోని మారుతి నగర్ సమిపం లోని సర్వే నెంబర్ 110, 111 నెంబర్ లు వేసి ప్రక్కనే ఉన్న కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలం లోని గుట్ట ని, మంచుకొండ లోని ప్రభుత్వ భూమి అక్రమ విక్రయ అగ్రిమెంట్లు, మామిళ్ళగూడెంలో ప్రభుత్వ భూమి రికార్డులు తారుమారు చేసి రిజిస్టేషన్ లు తదితర ప్రాంతల్లో అక్రమ వ్యవ హారం గురించి సంబధిత రిజిస్టార్లను విషయాల పై వివరణ కోసం టి మీడియా బృందం చేసిన ప్రయత్నం విఫలం అయింది.

Also Read : రైల్వే పాసుల సంగతేమిటీ.?

రికార్డ్ రూమ్ లో..
రిజిస్టర్ ల కార్యాలయం లోని రికార్డ్ లలో మసిదు గా వచ్చిన డబ్బులు ఉంచి అక్కడ నుండి అందరికి వాటాలు వెళుతున్న ట్లు గా సమాచారం.. అనుమతి ఉంటేనే అది కూడా కార్యాలయ సిబ్బందికి మాత్రమే ప్రవేశం ఉండే రికార్డ్ గదిలోకి అనధికారిక వ్యక్తులు వెళ్లిరావడం కనిపించింది. వీరి లో కన్సల్ టెన్సన్స్ ముసుగు లో ఉన్న దళారులు కావడం గమనార్హం (అక్రమ రిజిస్టేషన్ లు వివరాలు మరో కధనంలో.. )

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube