టీ మీడియా డిసెంబర్ 14 వనపర్తి : పెంట్లవెల్లి మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ పల్లె నాగరాజు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం రోజు స్వయంగా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి నాగరాజు ను పరామర్శించి డాక్టర్ని అడిగి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం కొల్లాపూర్ నియోజక వర్గం చిన్నంబావి మండలం మియాపూర్ గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన నాలుగు లక్షల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనారోగ్యం, ప్రమాదాల బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేద మధ్యతరగతి ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థికంగా కల్పిస్తుందని పేద వారికి ఎలాంటి కష్టం రాకూడదు అని వారి వైద్య సేవలకు అయిన ఖర్చులు ప్రభుత్వ సహాయ నిధి ద్వారా మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు.
