మాజీ ఎంపీటీసీకి పరామర్శ

మాజీ ఎంపీటీసీకి పరామర్శ

1
TMedia (Telugu News) :

మాజీ ఎంపీటీసీకి పరామర్శ
టి మీడియా,జూలై18, తిరుమలాయపాలెం:
మండలం లోని బీరోలు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు కొప్పుల చెన్న కృష్ణారెడ్డి గారు ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురై మంచంకే పరిమితమైనటువంటి చెన్న కృష్ణారెడ్డి గారిని సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు తిమ్మిడి హనుమంతరావు తన సొంత గ్రామమైన బీరోలు వెళ్లి పరామర్శించారు. కొప్పుల చేన్న కృష్ణారెడ్డి ఎంపీటీసీ సభ్యులుగా ఉన్న సమయంలో బీరోలు గ్రామ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా అభివృద్ధి చేశారని అలాంటి వ్యక్తులు అనారోగ్యానికి గురి కావడం బాధాకరంగా ఉందని తిమ్మిడి హనుమంతరావు అన్నారు. వారు త్వరగా కోలుకోవాలని మళ్లీ ప్రజల వద్దకు వచ్చి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనాలని ఆకాంక్షించారు.

 

Also Read : సి పి యం ఆధ్వర్యంలో రాస్తారోకో

కృష్ణా రెడ్డి గారి భార్య మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కొప్పుల సోమమ్మ గారికి ధైర్యంగా ఉండాలని ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చూసుకోవాలని ఆమెకి సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కొత్తపల్లి వెంకటరెడ్డి. నారేడు శ్రీనివాసరెడ్డి. కొత్తపల్లి కృష్ణారెడ్డి రాఘవరెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube