కలుషితమైన ఆహారం తిని గొర్రెలు మృతి

జీవన ఉపాధి కోల్పోయిన బాధితుడు

1
TMedia (Telugu News) :

కలుషితమైన ఆహారం తిని గొర్రెలు మృతి

జీవన ఉపాధి కోల్పోయిన బాధితుడు

టీ మీడియా, జూన్ 14, కరకగూడెం:

 

రోజువారీగా మేత కోసం అడవికి వెళ్లిన గొర్రెలు కలుషితమైన ఆహారం తిని 22 గొర్రెలు మృతి చెందిన సంఘటన సోమవారం మండలం కేంద్రంలో చోటు చేసుకుంది.

Also Read : కళలకు నిలయం పారిశ్రామిక ప్రాంతం

అందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.భట్టుపల్లి గ్రామానికి చెందిన రావుల చిన్న సైదులుకు సంబంధించిన 15 గొర్రెలు,సారిక మల్లయ్య చెందిన 7 గొర్రెలను వారిరువురు రోజువారీగా మేత కోసమని అడవికి తీసుకెళ్లగా అక్కడ కలుషితమైన ఆహారం తిని గొర్రెలు అక్కడికక్కడే సంఘటన స్థలంలో మృతి చెందాయి. అడవిలో మృతి చెందిన గొర్రెలను గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో గ్రామానికి తీసుకొని వచ్చారు.వీటి విలువ సుమారుగా 3 లక్షల25 వేలుగా ఉంటుందని బాధితులు తెలిపారు.

Also Read : కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు

అలాగే అడవి ప్రాంతంలో పక్షుల కోసం జువ్వి చెట్టు పండ్లుకు కొందరు వేటగాళ్ళు విషం పూయడంతో ఆ పండ్లు ఆహారంగా తీసుకుని గొర్రెలు మృతి చెందాయని బాధితులు ఆరోపిస్తున్నారు.తమ జీవన ఉపాధి కోల్పోయిందుకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube