అక్రమంగా తరలిస్తున్న పశువులను పట్టుకున్న ఖండ గో సంరక్షణ సమితి

0
TMedia (Telugu News) :

టీ మీడియా అశ్వరావుపేట నవంబర్ 24

నియోజకవర్గ కేంద్రమైన అశ్వరావుపేట లో ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న పశువులను అఖండ గో సంరక్షణ సమితి సభ్యులు పట్టుకున్నా సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం నుండి హైదరాబాద్ కు భారత్ బెంజ్ TS08 UB9365 అనే వాహనంలో అక్రమంగా పశువులను తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఖండ గో సంరక్షణ సమితి సభ్యులు నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట లో పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ ఐ రామ్మూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని గోవులను తరలిస్తున్న వాహనాన్ని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వ్యానులో ఉన్న గోవులను పశువైద్యాధికారి స్వప్న ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు.ఆమె మాట్లాడుతూ ఈ వాహనంలో 15 పశువుల కన్నా ఎక్కువ ఉండకూడదని అటువంటిది.

ఈ వాహనంలో 55 పశువులను ఎక్కించడం చాలా బాధ కరమైన విషయం అని ఆ విధంగా పశువులను ఎక్కించటం వల్ల చాలా పశువులు కాళ్ళు విరిగి పోయాయని తీవ్ర అనారోగ్యం పాలయ్యాయి అని మా పరిధిలో మెరుగైన వైద్యం అందిస్తాం అని ఆమె అన్నారు. యస్ ఐ రామూర్తి మాట్లాడుతూ పశువులను దగ్గర్లోని గోశాలకు తరలించేందుకు పోలీస్ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.తరలిస్తున్న వాహనం తో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.పశువుల అక్రమ రవాణాన్ని అడ్డుకున్న ఖండ సంరక్షణ సమితి సభ్యులు గారపాటి రాంబాబు,చవ్వా రమేష్,అప్పారావు, సింహాచలం, పశువులకు వైద్యం అందించిన పశువైద్యాదికారిణి స్వప్న లను పలువురు అభినందించారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube