పారంపర్య వైద్య మహా సంఘం, సాంప్రదాయ వైద్యులకు

నిరంతర ఔషధ విజ్ఞాన సదస్సు

0
TMedia (Telugu News) :

పారంపర్య వైద్య మహా సంఘం, సాంప్రదాయ వైద్యులకు

నిరంతర ఔషధ విజ్ఞాన సదస్సు

టీ మీడియా, డిసెంబర్ 28, చింతూరు : పారంపర్య మహా సంఘం, జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ఆఫ్రిన్ ఆయుర్వేద వైద్యశాల నిమ్మలగూడెం ప్రాంగణంలో నిర్వహించిన. సాంప్రదాయ వైద్య విధానం పై అవగాహన ఔషధాల తయారీ గురించి శిక్షణ నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఆయుష్ ప్రొఫెసర్ సురేష్ జకోటియ మాట్లాడుతూ సాంప్రదాయ పారంపర్య వైద్యం నేడు మానవాళికి ఎంతో ఉపయోగపడుతుందని అల్లోపతి వైద్యానికి లొంగని మొండి రోగాలు సైతం నయమవుతున్నాయన్నారు. వనమూలిక వైద్యంలో వైద్యులు తొలుత రోగాన్ని నిర్ధారిస్తే సగం సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఒక మూలిక 100 రకాల జబ్బులను నయం చేసే సంజీవినిల పనిచేస్తుందన్నారు. మన వైద్య విజ్ఞానం మనతోటే అంతరించకుండా మన వారసులకు తరఫున ఆయుర్వేద వనమూలిక వైద్యంలో మెలుకవులు నేర్పి భావితరాలకు ఆరోగ్యాన్ని ఆయుష్షుని ప్రసాదించాలని ఈ సందర్భంగా సూచించారు.

Also Read : ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి      

ఆయుర్వేద వైద్యులు మొహమ్మద్ గని మాట్లాడుతూ భద్రాచలం ఏజెన్సీ అటవీ ప్రాంతంలో ఎంతో విలువైన ఔషధ మొక్కలు పుష్కలంగా ఉన్నాయని తాను సందర్శించిన ప్రతిసారి ఎన్నో విలువైన మొక్కలు తన దృష్టికి వచ్చాయన్నారు. అంతరించిపోతున్న ఔషధ మొక్కలను ప్రతి ఒక్కరు కాపాడి ఆయుర్వేదాన్ని బ్రతికించాలని ఆయన తెలిపారు. ప్రపంచ దేశాలు 40% నేచర్ వైద్యంతోనే రోగాలను న్యాయం చేసుకుంటున్నారని భారతదేశం లాంటి విశాలమైన వనరులు ఉన్న క్రమంలో సంజీవిని లాంటి వనమూలికలు ఏజెన్సీ ప్రాంతంలో ఉండటం మన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కరోనా మహమ్మారి వైద్య నిపుణులు ఆనందయ్య మాట్లాడుతూ ఆయుర్వేదంలో ముందుగా రోగికి మానసిక ధైర్యం కలిగించాలని అప్పుడే మనం ఇచ్చే మూలికా వైద్యం నూటికి నూరు శాతం గుణం చూపెడుతుందన్నారు. ఆయుర్వేదంతో పాటు మానసిక ధైర్యం రోగిని త్వరితగతిన స్వస్థత చేకూరిలా చేస్తుందన్నారు. అనంతరం ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ మాట్లాడుతూ వారంపర్య వైద్య మహా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరంతర వైద్య విధాన సదస్సుకు అనేకమంది ఆయుర్వేద వైద్యులు హాజరు కావడం పట్ల హర్ష వ్యక్తం చేశారు. అనంతరం రక్త పరీక్ష కేంద్రం తో పాటుగా మెడికల్ స్టోర్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లను ఆయుర్వేద వైద్యులు ప్రారంభించారు. ఆంధ్ర, తెలంగాణ, చత్తీస్గడ్, ఒడిస్సారాష్ట్రాలకు చెందిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు వారి సేవలను గుర్తించి జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ మెమొంటో తో పాటుగా ప్రదర్శనశాపత్రం శాలువాలతో వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం రాజమహేంద్రానికి చెందిన స్వచ్ఛంద సంస్థ తుమ్మవ కార్యదర్శి ఎస్కే సుభాని. అహలె హదీస్ జిల్లా అధ్యక్షులు నౌషాద్. రాష్ట్ర నాయకులు నసీర్ అహ్మద్. ఎస్ పి ఎస్ మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ ఎస్ పి ఎస్ అమీర్. సహాయత ట్రస్ట్ జిల్లా డైరెక్టర్ ఎస్ కే ఇబ్రహీం జమాల్ ఖాన్ వైజ్ను వైద్యులను శాలువాలను కప్పి మెమొంటోతో సత్కరించారు.

Also Read : వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయి

ఆనందయ్య చేతులమీదుగా కరోనా మందును ఉచితంగా అందజేశారు. కార్యక్రమము జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించడమైనది. ఈ సమావేశంలో రిటైర్డ్ చీఫ్ సూపర్నెంట్. డా. సురేష్ జాకోటియా గవర్నమెంట్ ఇండియన్ ఫార్మసీ,తెలంగాణ, పారంపర్య వైద్య మహా సంఘం అధ్యక్షులు వైద్య చంద్రశేఖర్ రాజు పుత్తూరు, వైద్య అనందయ్య, నెల్లూరు ,వైద్య వేణుగోపాలరెడ్డి నెల్లూరు, వైద్య ప్రసాద్ రావు అనకాపల్లి , వైద్య ఎస్ రమేష్ ,వరంగల్, వైద్య లక్ష్మణ్, హైదరాబాద్, ముసద్దిక్,ఖజమస్తాన్, భవాని, అబ్దుల్ జబ్బార్, షేక్ వినాయ, మహమ్మద్ ఖబీర్ ఖాన్, షేక్ సుభాని, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుంచి పారంపర్యంగా వైద్యం చేస్తున్న సంప్రదాయ వైద్యులు. జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ ఇమ్రాన్ ఖాన్. ట్రస్ట్ ఇంచార్జ్ సుభాని, ట్రస్ట్ బోర్డు మెంబర్ జావేద్, పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube