చెక్ డ్యాం ల నిర్మాణంలోకాంట్రాక్టర్ల మాయ

నాసిరకంగా ఇసుక,సిమెంటుపనులు

1
TMedia (Telugu News) :

 

చెక్ డ్యాం ల నిర్మాణంలోకాంట్రాక్టర్ల మాయ

-నాసిరకంగా ఇసుక,సిమెంటుపనులు

-ఆక్రమంగా బండ రవాణా

టి మీడియా, జూన్26, కరకగూడెం:

రైతులు రెండు పంటలను పండించే విధంగా ఉపయోగించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెక్ డ్యాం నిర్మాణాలు చేపట్టింది.రైతులకు నీటి అవసరాలు తీర్చేందుకు చెక్ డ్యాం ద్వారా రూ. కోట్లు ఇచ్చింది.నిర్మాణం పనులు ఎంత నాణ్యత పాటిస్తే,భవిష్యత్తు తరాలకు అంత పటిష్టంగా ఉంటుంది.కానీ ఏజెన్సీ కరకగూడెం మండలంలోని చొప్పాల గ్రామ పంచాయతీ పరిధిలో ముసలమ్మ తల్లి పరిసరాల దగ్గర పెద్ద వాగు పై నిర్మించిన చెక్ డ్యాం పనుల్లో నాసిరకంగా ఇసుక, సిమెంట్,కంకర తదితర నాణ్యత పాటించడం లేదని స్థానిక రైతులు పేర్కొన్నారు.చెక్ డ్యాం పనులలో భాగంగా ఒక రైతు అనుమతి లేకుండా తన పట్టభూమిలో ఇసుక,కంకర,బండాలు నిల్వ చేసి,సాగుకు చేయకుండా నాశనం చేశారు.

Also Read : కొల్లాపూర్‌లో టెన్షన్‌.. టెన్షన్‌..

చుట్టుపక్కల చెట్లలను తొలగించారని ఆవేదన రైతు ఆవేదన వ్యక్తం చేశారు.చెక్ డ్యాం పనులు పూర్తి కానున్న నేపథ్యంలో ఇరువైపుల ఎత్తు మెత్తలకు బండలు అమర్చడం కోసం అడవి నుండి ట్రాక్టర్ల ద్వారా ఆక్రమంగా బండలను ఆటవీ ఆధికారుల కళ్ళు కప్పి రవాణా చేస్తున్నారు.పనులను సం,,లో పూర్తి చేయాల్సిండగా కాంట్రాక్టర్ల ఇష్టం వచ్చినట్లు ముందుగానే హడావిడిగా చేస్తూ,కాంట్రాక్టర్లలకు సొత్తుగా ఆధికారులు వ్యవహరించడంతో బిల్లులు మాత్రం ఎక్కువగా చూపిస్తూ దోపిడిలా రాజ్యంగా మారుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube