బతుకమ్మ ఆటతో నిరసన తెలియచేసిన కాంట్రాక్టు కార్మికులు

బతుకమ్మ ఆటతో నిరసన తెలియచేసిన కాంట్రాక్టు కార్మికులు

1
TMedia (Telugu News) :

బతుకమ్మ ఆటతో నిరసన తెలియచేసిన కాంట్రాక్టు కార్మికులు

టీ మీడియా,సెప్టెంబర్ 20, గోదావరిఖని : కాంట్రాక్టు కార్మిక సంఘాల జె.ఏ.సి.ఆధ్వర్యంలో మంగళవారం మెయిన్ చౌరస్తాలో బతుకమ్మ ఆట ఆడి నిరసన తెలియచేయడం జరిగింది.12 రోజులుగా కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తుంటే యాజమాన్యం పట్టించుకోకుండా కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.కార్మికుల ఆకలి బాధలు యాజమాన్యానికి పట్టదా అని ప్రశ్నించారు. బ్రతికుంటే పనిచేయించుకోవడం మాత్రమే యాజమాన్యానికి తెలుస్తుంది,కానీ కార్మికుల బాధలు మాత్రం పట్టించుకోకపోవడం న్యాయమా అని అడిగారు. కాంట్రాక్టు కార్మికులు లేకుంటే మీకు బ్రతుకుందా అని ప్రశ్నించారు.కార్మికులు శ్రమను,రక్తమాంసాలను దారపోసి లాభాలు తెస్తే మీరు వాటిని అనుభవిస్తున్నారని అన్నారు.మేమె లేకుంటే మీకు మనుగడ ఎక్కడిదని ఆవేదన వ్యక్తంచేశారు.కొలబెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు ఇప్పటికైనా యాజమాన్యంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు.ఈనెల 22 న జరిగే చర్చల్లో సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేదంటే పర్మినెంట్ కార్మిక సంఘాల నాయకులను కలుపుకుని ఉత్పత్తిని అడ్డుకుంటామని హెచ్చరించారు.

Also Read : ఎమ్మెల్యే పరామర్శ

ఈ నిరసన కార్యక్రమంలో
సీఐటీయూ అనుబంధ ఎస్సిఈయూ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, ఇఫ్ట్ రాష్ట్ర అధ్యక్షులు టి.శ్రీనివాస్,సిపిఐ రాష్ట్ర నాయకులు గౌతమ్ గోవర్ధన్,కాంగ్రేసు పార్టీ నాయకులు మక్కాన్ సింగ్,టి.ఎల్.పి.రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్, మద్దతుగా మాట్లాడారు.ప్రత్యక్ష ఉద్యమంలో ఉంటామని తెలియచేసారు.ఈ కార్యక్రమములో సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు వేల్పుల కుమార స్వామి,తోకల రమేష్,
కె విశ్వనాథ్,శనగరపు చంద్రశేఖర్ మద్దెల శ్రీనివాస్, ఎంఏ.గౌస్,నరేష్,బి.లింగయ్య,కే.శంకర్,సిహెచ్.ఉపేందర్,శ్యామ్ నేరెళ్ల రాజేందర్,కోట వెంకన్న,వరలక్ష్మి మదునమ్మ,లతోపాటు 300 మంది కార్మికులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube