టీ మీడియా,డిసెంబర్ 18, గోదావరిఖని :
గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సిపిఐ రామగుండం నగర సమితి నేతృత్వంలో బాలింతల వార్డును సందర్శించి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది.అనంతరం సిపిఐ నగర కార్యదర్శి కె.కనకరాజ్,సహాయ కార్యదర్శి మద్దెల దినేష్,లు మాట్లాడుతూ…ఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఉన్న బాలింతలు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డైట్ కాంట్రక్టర్ పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.రోజు వారిగా మెను ప్రకారం బాలింతలకు పాలు,గుడ్డు,బ్రెడ్డు,డ్రై,ఫ్రై ఫుడ్ అందించకపోవడం వల్ల బాలింతలు అరిగోస పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కావున పాత కాంట్రక్టర్ ఇక్కడి నుండి కదలడు, కోత్తా కాంట్రక్టర్ రాడు వీరి ఇరువురి వల్ల మధ్యలో రోగుల నష్టపోతాన్నరని కావున మరొక స్థానిక కొత్త డైట్ కాంట్రాక్టర్ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.కావున నిర్లక్ష్యపు కాంట్రాక్టర్ల నిర్వాకం పై జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్, జిల్లా సుపరిండెంట్,ప్రభుత్వ ఆస్పత్రి సూపరెండెంట్, దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తొడుపునూరి రమేష్ కుమార్,మండల శ్రీనివాస్,నరేష్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.