*వంటనూనెల కాదుణాల్లో సోదాలు

-బైట పడిన నకిలీ స్టిక్కర్ల బాగోతం

0
TMedia (Telugu News) :

*వంటనూనెల కాదుణాల్లో సోదాలు

-బైట పడిన నకిలీ స్టిక్కర్ల బాగోతం

టీ మీడియా, మార్చి 7,చిత్తూరు :నగరంలోని వంట నూనెలు విక్రయించే పలు దుకాణాలపై ఆదివారం రెవెన్యూ , విజిలెన్స్ , లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో కొన్ని దుకాణాలలో వంటనూనెల బాక్సులు , ప్యాకెట్లపై ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరలతో ముద్రించిన స్టిక్కర్లు అతికించి ఉండడాన్ని అధికారులు గుర్తించారు. నగరంలోని శేష పిరాన్ వీధి , చర్చ్ వీధులలో ఉన్న కొన్ని వంటనూనెల విక్రయించే దుకాణాలపై అధికారులు తనిఖీలు నిర్వహించారు.

also read:గవర్నర్ ప్రసంగినికే దిక్కు లేదు ఎమ్మెల్యేలెంత..?

ఈ దాడులలో ఎమ్మార్పీ ధర కంటే స్టిక్కరింగ్ వేసిన బాక్సులను , ప్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా అధిక ధరలకు నూనెలు గాని ఇతర నిత్యావసర సరుకులు గాని అమ్మితే అట్టి వారిపై చట్టపరంగా కఠిమైన చర్యలు తీసుకుంటామని , ఇటువంటి దాడులు ఇక తరుచుగా జరుపుతూనే ఉంటామని అధికారులు హెచ్చరించారు . ఈ దాడులలో
విజిలెన్సు డీఎస్పీ మల్లేశ్వరరెడ్డి , సీఐ లు మల్లికార్జున , వెంకటరవి శేఖరరెడ్డి , డీసీటీఓ లు చెన్నారెడ్డి , విజయకుమార్ , ధనుంజయ, లీగల్ మెట్రోలాజి , పౌరసరఫరా అధికారులు కూడా పాల్గొన్నారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube