కాంగ్రెస్, టిడిపి నాయకుల సమన్వయ సమావేశం

కలిసికట్టుగా పని చేద్దాం భట్టి ని గెలిపిద్దాం

0
TMedia (Telugu News) :

కాంగ్రెస్, టిడిపి నాయకుల సమన్వయ సమావేశం

– కలిసికట్టుగా పని చేద్దాం భట్టి ని గెలిపిద్దాం

– డా. వాసిరెడ్డి రామనాథం

టీ మీడియా, నవంబర్ 18, మధిర: మధిర క్లబ్ కాంప్లెక్స్ లో శనివారం కాంగ్రెస్ పార్టీ టిడిపి పార్టీ సమన్వయ సమావేశం టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసిరెడ్డి రామనాథం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగా హనుమంతరావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు కాంగ్రెస్ నాయకులు మధ్య సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథ మాట్లాడుతూ.. అధిష్టానం మేరకు కాంగ్రెస్ పార్టీతో ముందుకు సాగుదామని కలిసికట్టుగా పనిచేసి మధిర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లు భట్టి గెలుపుకై కృషి చేద్దామని అందుకే ప్రతి టిడిపి కార్యకర్త నాయకులు ఈనెల 20తేదిసోమవారం సాయంత్రం ఐదు గంటల నుండి అన్ని డివిజన్లో టిడిపి, కాంగ్రెస్ శ్రేణులు కలిసి విస్తృత ప్రచారం చేసి మల్లు భట్టి విక్రమార్క అత్యధిక మెజార్టీ గెలుపు కోసం కృషి చేద్దామని ఆయన తెలిపారు.

Also Read : ఇది బూత్ లెవెల్ కమిటీ సమావేశమా.. మినీ ప్రజాఆశీర్వాద సభ నా

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ, విజయ్ కుమార్, మొండితోక సుధాకర్, మునుగోటి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగార్జున, యన్నం కోటేశ్వరరావు, చెరుకూరి కృష్ణారావు, శ్రీహరి. మరియు టిడిపి నాయకులు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube