పోలీస్ వారికి సహకరించాలి: ఎస్పీ
టి మీడియా,మే07, జగిత్యాల:ట్రాఫిక్ నియమ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్న వాహనదారులకు విదిస్తున ట్రాఫిక్ ఈ-చాలన్స్ ఇకనుండి సిసి కెమెరాల ద్వారా కూడా గుర్తించి జరిమానాలు విధించడం జరుగుతుందని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూ శర్మ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల అన్నిటి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేయడం జరిగిందనీ,ఈ యొక్క కమాండ్ కంట్రోల్ ద్వారా ట్రాఫిక్ నియమాలను అతిక్రమించిన వారి ని గుర్తించి జరిమానాలు విధించడం జరుగుతుందని శనివారం అన్నారు. ట్రాఫిక్ మొబైల్ ఏక్సిబిషన్ వ్యాన్ ద్వారా ప్రజలకు ట్రాఫిక్ నియమలపై, రోడ్డు ప్రమాదాల నివరణ గురించి ప్రతి రోజు ఒక గ్రామంలో అవగాహన కలిపిస్తున్నామని అన్నారు.వాహనాలుదారులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్,సీటు బెల్టు ధరించాలని సూచించారు.వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను, ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీస్ శాఖ వారికి సహకరించాలని కోరారు., వాహనదారులు తమ యొక్క వాహనాలపై ఉన్న ట్రాఫిక్ ఈ- చాలన్స్ ను సకాలంలో చెల్లించాలని కోరారు.మూడు కంటే ఎక్కవగా ట్రాఫిక్ ఈ-చాలన్స్ పెండింగ్ లో ఉన్న వాహనాలు జిల్లా వ్యాప్తంగా గుర్తించడం జరిగిందని సదరు వాహనదారులు సకాలంలో తమ యొక్క పెండింగ్ ఈ-చాలాన్స్ ను చెల్లించ లేనిపక్షంలో సదరు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రూపేష్ ఐపీఎస్ టౌన్ ఇన్స్పెక్టర్ కిషోర్,ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్,జగిత్యాల ట్రాఫిక్ ఎస్.ఐ రాము మరియు సిబ్బంది పాల్గొన్నారు.