బడుల్లో కరోనా కేసులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా అశ్వారావుపేట నవంబర్26

కరోనా మహమ్మారి మండలంలో మరల విజృంభించే పరిస్థితి ఉన్నట్లు ఘోచరిస్తుంది. ఇప్పుడిప్పుడే విద్యారంగం గాడిన పడుతున్న వేళా మండలంలోని రెండు పాఠశాలల్లో శుక్రవారం కేసులు నమోదు అవ్వడం ఇటు ఉపాధ్యాయులకు,పిల్లల తల్లిదండ్రులకు ఒకింత ఆందోళన కలిగిస్తుంది.వివరాల్లోకి వెళితే నియోజకవర్గ కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్ధికి గత మూడు రోజుల క్రితం జ్వరం రావడం తో అప్పటినుండి స్కూల్ కి రావడం లేదు. తల్లిదండ్రులు ఈ రోజు శుక్రవారం విద్యార్థిని కి కరోనా పరీక్షలు చేయించడం తో కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. అందుకనే ముందస్తు జాగ్రత్తగా 8తరగతి లోని 66 మంది విద్యార్థుల కు,స్కూల్ లోని17 ఉపాధ్యాయులకు వైద్యార్థికారులు కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగిటివ్ వచ్చినట్లు ప్రధానోపాధ్యాయులు రాంబాబు తెలిపారు.

ఇదిలా ఉండగా మండలంలోని గంగారాం గ్రామంలో ని యూపీస్ పాఠశాల ఉపాధ్యాయుడు కి కూడా పాజిటివ్ రావడంతో అక్కడ ఉన్న 8 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికి నెగిటివ్ వచ్చింది. ఏది ఏమైనా భౌతిక దూరం,మాస్క్,విరివిగా చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరిగా కరోనా నిబంధనలను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Corona cases in school
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube