ప్రజాస్వామ్యానికి అవినీతి అతిపెద్ద శత్రువు: రాష్ట్రపతి ముర్ము
ప్రజాస్వామ్యానికి అవినీతి అతిపెద్ద శత్రువు: రాష్ట్రపతి ముర్ము
ప్రజాస్వామ్యానికి అవినీతి అతిపెద్ద శత్రువు: రాష్ట్రపతి ముర్ము
టీ మీడియా, జనవరి 31, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేశారు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన్ స్కీమ్‌ను విస్తరించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ స్కీమ్‌పై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. కోవిడ్19 మహమ్మారి వేళ ప్రజల ప్రాణ రక్షణ కోసం తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని ముర్ము అన్నారు. మహిళల సాధికారత కోసం కేంద్ర సర్కార్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని, బేటీ బచావో.. బేటీ పడావో సక్సెస్ అయినట్లు ఆమె తెలిపారు. దేశంలో పురుషుల సంఖ్య కన్నా ఇప్పుడు మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని, మహిళ ఆరోగ్య స్థితి కూడా మెరుగుపడినట్లు ఆమె చెప్పారు. రైతుల ఆదాయాన్ని వృద్ధి చేశామని, గ్రామాలను కూడా డెవలప్ చేస్తున్నట్లు తెలిపారు. గరీబీ హఠావో స్కీమ్‌తో దేశంలో పేదరికాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నామని ఆమె చెప్పారు. గతంలో ట్యాక్స్ రిఫండ్ కోసం చాలా కాలం వేచి చూసేవాళ్లు అని, ఇప్పుడు కేవలం కొన్ని రోజుల్లో ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ వస్తున్నాయని ఆమె తెలిపారు. అవినీతిని అంతం చేయాలంటే బలమైన వ్యవస్థను నిర్మించాలని, ప్రజాస్వామ్యానికి.. సామాజిక న్యాయానికి అతిపెద్ద శత్రువు అవినీతి అని రాష్ట్రపతి ముర్ము తెలిపారు. దేశ ప్రజల్లో విశ్వాసం టాప్ స్థాయిలో ఉందని, ఇదే అతిపెద్ద మార్పు అని, ఇండియా పట్ల ప్రపంచ దేశాల దృష్టి కూడా మారినట్లు ఆమె వెల్లడించారు.
Also Read : 2.9 శాతానికి పడిపోనున్న ప్రపంచ ఆర్ధిక వృద్ధి
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నుంచి ట్రిపుల్ తలాక్ రద్దు లాంటి కీలక అంశాల నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్థిరమైన, భయంలేని, నిర్ణయాత్మక ప్రభుత్వం అధికారంలో ఉందని, పెద్ద పెద్ద కలల్ని ఆ ప్రభుత్వం నెరవేరుస్తున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. పేదరికం లేని భారత్‌ను నిర్మించాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. భారతీయుల ఆత్మస్థైర్యం అత్యున్నత స్థాయిలో ఉందని, ప్రపంచ దేశాలు ఇప్పుడు మనల్ని భిన్న కోణంలో చూస్తున్నాయని, ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఇండియా పరిష్కారాలు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube