అవినీతి పై విచారణ జరపాలి

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

1
TMedia (Telugu News) :

అవినీతి పై విచారణ జరపాలి

– బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

టీ మీడియా,జులై 6, గోదావరిఖని :

రామగుండం కార్పొరేషన్ లో జరుగుతున్న కౌన్సిల్ సమావేశాల్లో ఏర్పాటు చేసిన బోజనాల ఖర్చు పై విచారణ జరిపించాలని, అదేవిధంగా కార్పొరేషన్ లో వివిధ విభాగాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని,ప్రజాధనాన్ని కాపాడాలని సిపిఐ నగర కార్యదర్శి కే.కనకరాజ్, సహాయ కార్యదర్శి మద్దెల దినెష్ లు మంగళవారం స్థానిక సంస్థల ఉన్న అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ ను కలిసి ఇచ్చిన వినతి పత్రం లో డిమాండ్ చేశారు.

 

Also Read : ఇఎస్ఐ అసుపత్రి నిర్మాణం కోసం స్థల పరిశీలన

కార్పొరేషన్ లో వివిధ విభాగాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై దృష్టి పెట్టి గుడ్ గవర్నెన్స్ గా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వారు అదనపు కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అబ్దుల్ ఘని తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube