మహిళపై కౌన్సిలర్ దౌర్జన్యం ..

చెప్పినట్లు వినకపోతే షాపు ఖాళీ చేయిస్తానని వేధింపులు

1
TMedia (Telugu News) :

మహిళపై కౌన్సిలర్ దౌర్జన్యం ..

-చెప్పినట్లు వినకపోతే షాపు ఖాళీ చేయిస్తానని వేధింపులు

-ఆరు నెలలుగా మహిళలపై సాగుతున్న వైసీపీ కౌన్సిలర్ ఆగడాలు

-షాపు వద్ద దౌర్జన్యానికి దిగిన కౌన్సిలర్ – ప్రతిఘటించిన మహిళ

-పోలీసుల నిర్లక్ష్యం.. మహిళ కుటుంబంపై దాడి

టి మీడియా,మే8,పల్నాడు:పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం సురేష్ మహల్ షాపింగ్ కాంప్లెక్స్ లో పాల వ్యాపారం చేసుకునే ఓ మహిళపై 8వ వార్డు వైసిపి కౌన్సిలర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. మహిళా పై కన్నేసిన ఆ కౌన్సిలర్ నేను చెప్పినట్లు వినకపోతే నీ షాపు ఖాళీ చేపిస్తాను అని గత ఆరు నెలలుగా వేధిస్తున్నట్లు మహిళ వాపోయింది. శనివారం సాయంత్రం షాపు వద్ద నేను ఒంటరిగా ఉండగా కౌన్సిలర్ వచ్చి నీ షాపు ఖాళీ చేపిస్తాను అని దౌర్జన్యం చేయగా ఇదేమిటని ప్రశ్నించగా వాదనకు దిగి నాపై దౌర్జన్యానికి దిగి ఘర్షణకు పాల్పడ్డాడు.

Also Read : పెరిగిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర

ఆ దగ్గరలో ఉన్న పోలీసులు వచ్చి ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. పోలీసుల ఆధీనంలో ఉన్న నాపై ఆ కౌన్సిలర్ భార్య, వారి అనుచరులు పోలీసు సమక్షంలోనే దౌర్జన్యానికి పాల్పడి దుర్భాషలాడారు.ఆదివారం ఉదయం కౌన్సిలర్ ఆయన భార్య అనుచరులు నా కుటుంబ సభ్యుల పై దాడి చేసి గాయపరిచారు. ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube