దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయండి

దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయండి

1
TMedia (Telugu News) :

దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయండి

టీ మీడియా, మార్చి20, మధిర:కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 28,29 దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయండి అంటూ మధిరలో సిఐటియు ఆధ్వర్యంలో పోస్టరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీలం నరసింహారావు మాట్లాడుతూ… ఈ సమ్మె లో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న మున్సిపల్, గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల అంతా పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాలు జేఏసీ నిర్ణయించింది. దేశాన్ని కాపాడుదాం ప్రజల్ని రక్షించుకుందాం అనే నినాదంతో జరుగుతున్న మార్చి 28, 29 రెండు రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మార్చి 28న మండల కేంద్రాలు, మున్సిపల్ పట్టణాల్లో ప్రదర్శనలు, నిరసనలు, వంటా వార్పు కార్యక్రమాలు, మార్చి 29న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసనలు చేసి సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టియుసి, హెచ్ఎంఎస్, ఐ ఎఫ్ టి యు, టిఆర్ఎస్ కేవి, టిఎన్ టియుసి, ఏఐయుటియుసి అనుబంధ యూనియన్ల మున్సిపల్, గ్రామ సంచాణుని రాష్ట్ర యూనియన్లు పిలుపునిచ్చారని
నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి 5కనీస వేతనాల జీఓలను అమలు చేయాలి. మిగిలిన షెడ్యూల్డ్ పరిశ్రమలకు వెంటనే కనీస వేతన జీఓలు ప్రకటించి అమలుచేయాలి.
వెనక్కితీసుకున్న మూడ రైతు చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేసి, ఎలక్ట్రిసిటీ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలి.
నేషనల్ మానిటైజేషన్ పైపైప్, నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్లను రద్దు చేయాలి.

Also Read : ఫస్ట్ ర్యాంకర్ ప్రణీత్ ను ఆశీర్వదించినపద్మశాలి సేవ సంఘo

కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి.
ట్యాక్స్ పరిధిలో లేని అసంఘటితరంగ కార్మికులకు రూ.7,500/-లు నెలకు చెల్లించాలి. అసంఘటితరంగ కార్మికులకు యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ను ప్రవేశపెట్టాలి.
ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్ నిధుల కేటాయింపు పెంచాలి. ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలి.స్కీమ్ వర్కర్లకు చట్టపరమైన కనీస వేతనాలు చెల్లించాలి. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.కరోనా కాలంలో పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్కు ఇన్సూరెన్స్ మరియు రక్షణ సామాగ్రి అందజేయాలి.దేశంలోని అత్యధిక ధనవంతుల (కార్పొరేట్ వర్గాలు) ఆదాయంపై సంపద ట్యాక్స్న పెంచి, విద్యా, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలకు కేటాయించాలి.పెట్రోల్, డీజిల్పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలి.నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు పంపిణీ చేయాలి.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులురాధాకృష్ణ,పడకండిమురళి,మందాసైదులు,నామాలశ్రీను,గోగులనాగమల్లేశ్వరరావు, పల్లపు గోపీ, నాగరాజు, ప్రసాదు, కొండలు, రాము,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube