స్వల్పంగా తగ్గిన కేసులు
టి మీడియా,జూన్20, ఢిల్లీ:
భారత్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఒక్కరోజే 12,781 మందికి వైరస్ సోకింది. మరో 18 మంది చనిపోయారు. 8537 మంది కోలుకున్నారు.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 12,781 మంది వైరస్ బారినపడగా.. మరో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,537 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.62 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.17 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా ఉంది.
“మొత్తం కరోనా కేసులు: 43,309,473..
“మొత్తం మరణాలు: 5,24,873..
“యాక్టివ్ కేసులు: 76,700..
“కోలుకున్నవారి సంఖ్య: 4,27,07,900
భారత్లో ఆదివారం 2,80,136 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,18,66,707 కోట్లకు చేరింది. మరో 2,96,050 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
Also Read : భారత్ బంద్ ఎఫెక్ట్
“World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు తగ్గాయి. ఒక్కరోజే 259,150 మంది వైరస్ బారినపడ్డారు.మరో 563 మరణాలు నమోదయ్యాయి.
“మొత్తం కేసుల సంఖ్య 543,984,866కు చేరింది. మరణాల సంఖ్య 6,340,676కు చేరింది.
“ఒక్కరోజే 350,620 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 519,482,011గా ఉంది.
Also Read : పంచాయతీ నిధులతో సి సి రోడ్డు శంకుస్థాపన
“తైవాన్లో మరో 50,636 కేసులు.. 172కుపైగా మరణాలు నమోదయ్యాయి.
“ఇటలీ ఒక్కరోజే 30,526 మంది కొవిడ్ బారినపడగా.. 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
“ఆస్ట్రేలియాలో 22,123 కరోనా కేసులు, 42 మరణాలు నమోదయ్యాయి.
“ఉత్తర కొరియాలో 19,320 కేసులు బయటపడ్డాయి.
“అమెరికాలో 17,928 కేసులు వెలుగుచూశాయి. 30 మందికిపైగా చనిపోయారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube