వైద్య ఆరోగ్య శాఖలో కోవిడ్ కుంభకోణం

ఐసిడియస్ సిబ్బంది సహకారం

1
TMedia (Telugu News) :

వైద్య ఆరోగ్య శాఖలో కోవిడ్ కుంభకోణం

– ఐసిడియస్ సిబ్బంది సహకారం

– వ్యాక్షిన్ వెయ్యకుండానే వేసినట్లు నమోదు

– ప్రవైట్ కి వైల్స్,సిరంజ్ లు అమ్మకం

టీ మీడియా,సెప్టెంబర్ 5,ఖమ్మం ప్రతినిధి: పలు ఆరోపణలు ఉన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లో మరో అక్రమం వెలుగు చూసింది.ఏకంగా కొ విడ్ వ్యాక్సిన్ వైల్స్,సిరంజి లు ప్రవైట్ లో అమ్ము కోవడం ద్వారా లక్షల రూపాయలు అక్రమాల కు పాల్పడ్డట్లు తెలుస్తోంది.ఇందుకు అవసరం అయిన సహకారం అంగన్వాడీ సిబ్బంది అందించి నట్లు వెల్లడి అయింది వివరాలు పరిసలిస్తే …

 

Also Read : నేడుబి.ఆర్ అంబేద్కర్ సేవాసమితి ప్రారంభం

ప్రభుత్వం కోవీడ్ వైరస్ నిరోధ చర్యల్లో భాగంగా వ్యాక్షి నేషన్ నీ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఉచితంగా వేయించే ప్రక్రియ నిర్వహిస్తోంది.ప్రవైట్ లో కూడా సేవలు పొందే అవకాశం రుసుము ద్వారా ఉంది.అత్యంత విలువైన ఈ వ్యాక్సిన్ వైల్ లు ప్రభుత్వ,ప్రవైట్ లో ఎవరికి వా డారో ఆన్లైన్ లో ఆరోగ్య శాఖ ద్వారా మాత్రమే నమోదు చెయ్యాలి.ప్రవైట్ లో అయితే తీసుకొన్న మొత్తం వివరాలు ప్రభుత్వంకుఇవ్వాలి.అధికారికంగా వ్యాక్సిన్ వైల్స్ తీసుకొంటే అధిక మొత్తం చార్జి చేసే అవకాశం లేదు. వివరాలు ఇవ్వాలి ఇది అంత లేకుండా అనధికారికంగా వైద్య ఆరోగ్య శాఖ లోనిఅక్రమార్కుల ద్వారా పొంది అధిక రెట్లు కొంతమంది ప్రవైట్ లో తమ వద్ద కు వచ్చిన వారి నుండి వసూలు చేస్తున్నారు. తమ వద్దకు వైద్యం కోసం వచ్చే వారు గతం లో వ్యస్ వేయించుకున్న ఇప్పుడు తిరిగి వేయించు కోవాలి అని కొంతమంది ప్రవైట్ వైద్యులు అదేశిస్తున్న రు.

ఆధార్ ఆధారంగా అక్రమం
అంగ్నవాడి లో బూత్ లెవల్ అధికారులు కావడం తో వారివద్ద వారీ పరిధి లోని. వారి ఆధార్ నెంబర్ లు ఉంటాయి.వ్యాక్షిన్ వేయించడం లోనూ అంగన్వాడీ లు ప్రమేయం ఉంది.ఆధార్ వివరాలు ఆధారంగా వ్యాక్సిన్ వేయించు కొని వారు కూడా వేయించు కొన్నట్లు ఆన్లైన్లో వివరాలు నమోదు చేశారు..
అక్రమాలు ఇవి గో
ఉదా హారణకు.నగరం లోని 22 వ డివిజన్ లో నివాసం ఉండే ఏస్ ఇందిర ఓక్కడోస్ మాత్రమే వేయించు కొంది.అనారోగ్యం తో మిగితా వి వేయించు కోలేదు.ఆమె రెండు,మూడు,బూస్టర్ డోస్ లు ముస్తాఫా నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో, స్థానిక అంగన్వాడీ నాగమణి ద్వారా వేయించు కొన్నట్లు నమోదు చేశారు.ఖమ్మం నగరం లో నివాసము ఉండి ఇక్కడి అడ్రస్ ఆధార్ లు ఉన్న వారు,వ్యాక్షిన్ వేయించు కొక పోయిన ఖమ్మం రూరల్ మండలం లో వేయించు కొన్నట్లు నమోదు చేశారు..25 రోజులు క్రితం చని పోయిన వ్యక్తి 5 రోజుల క్రితం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వేయించు కొన్నారు..అమెరికాలో 4 నెలల నుండి ఉంటున్న వ్యక్తి 3 రోజులు క్రితం అంగన్వాడీ ద్వార వేయించు కొన్నారు.ఇటువంటి అక్రమాలు అనేకం బైట పడ్డాయి.అన్నింటిలో అత్యధికం అంగన్వాడీ లు ద్వారా వచ్చి వేయించు కొన్నట్లు చూపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube