గోవులను తరలిస్తున్న వాహనం పల్టీ

గోవులను తరలిస్తున్న వాహనం పల్టీ

1
TMedia (Telugu News) :

గోవులను తరలిస్తున్న వాహనం పల్టీ

టీ మీడియా జూలై 26 ,తిరుమలాయపాలెం : రహస్యంగా గోవులను తరలిస్తున్న వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టిన సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం నుండి హైదరాబాదుకు గోవులను తరలిస్తున్న బొలోరో వాహనం మండల పరిధిలోని పాతర్ల పాడు బస్టాండ్ సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టి పల్టీకోగా వాహనంలో ఉన్న 14 గోవులలో 9 గోవులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Also Read : రాజ్య‌స‌భ టీఆర్ఎస్ ఎంపీలపై స‌స్పెన్ష‌న్

బతికిన ఐదు గోవులను గోసాల కు తరలించినట్లు పోలీసులు వివరించారు ఈ సంఘటన స్థానికుల ద్వారా తెలుసుకున్న ఎస్ ఐ వరాల శ్రీనివాస్ సంఘటనా స్థలానికి వెళ్లి జరిగిన సంఘటన పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు గోవులను కబేళాలకు తరలిస్తున్నట్లు సమాచారం పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube